Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‎లోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు.. ఎన్ని వేల కోట్లకు పెరిగాయంటే..

ప్రస్తుతం పెట్టుబడి పెట్టేవారికి మ్యూచువల్‌ ఫండ్స్ మొదటి ఎంపిక అవుతుంది. అందుకే మ్యూచువల్‌ ఫండ్స్‎లో ఇన్వెస్ట్ చేసేవారు పెరుగుతున్నారు. స్టాక్ మార్కెట్‎పై అవగాహన లేని వారికి మ్యూచువల్‌ ఫండ్స్‎లో పెట్టుబడి పెడుతున్నారు...

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‎లోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు.. ఎన్ని వేల కోట్లకు పెరిగాయంటే..
Mutual Funds
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 22, 2021 | 2:23 PM

ప్రస్తుతం పెట్టుబడి పెట్టేవారికి మ్యూచువల్‌ ఫండ్స్ మొదటి ఎంపిక అవుతుంది. అందుకే మ్యూచువల్‌ ఫండ్స్‎లో ఇన్వెస్ట్ చేసేవారు పెరుగుతున్నారు. స్టాక్ మార్కెట్‎పై అవగాహన లేని వారికి మ్యూచువల్‌ ఫండ్స్‎లో పెట్టుబడి పెడుతున్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‎లో రెండు రకాలుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకటి SIP, రెండోది lumpsum. SIP అంటే నెలనెలా కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. lumpsum అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. ఇందులో చాలా మంది SIP రూపంలో పెట్టుబడి పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో సిప్‌లలో పెట్టుబడులు రూ.67,000 కోట్లకు చేరుకున్నాయి.

2020-21లో సిప్‌లలో ₹96,080 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లలో సిప్‌ల ద్వారా వస్తున్న నిధుల వాటా రెండింతలకు పైగా పెరిగింది. 2016-17లో ఈ నిధులు రూ.43,921 కోట్లుగా ఉంది. నెలవారీ సిప్‌ వసూళ్లు ఈ ఏడాది అక్టోబరులో రూ.10,519 కోట్లతో జీవితకాల గరిష్ఠానికి చేరాయి. అక్టోబర్ నెలలో నమోదైన కొత్త సిప్‌ల సంఖ్య 23.83 లక్షలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి ఏడు నెలల్లో(ఏప్రిల్-అక్టోబర్) మొత్తం రిజిస్ట్రేషన్లు 1.5 కోట్లకు చేరుకున్నాయి.

Read Also.. Paytm: పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేస్తున్న పేటీఏం షేర్లు.. మరింత తగ్గుతాయా..?