Anand Mahindra: నేను అలా అనలేదు.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా..

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాపై ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై మహీంద్రా ఆదివారం ట్విటర్‌లో స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు...

Anand Mahindra: నేను అలా అనలేదు.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా..
Mahindra
Follow us
Srinivas Chekkilla

| Edited By: Anil kumar poka

Updated on: Nov 22, 2021 | 7:01 PM

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాపై ఫేక్ వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీనిపై మహీంద్రా ఆదివారం ట్విటర్‌లో స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. ఒక పోస్ట్‎ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. గత కొన్నిరోజులుగా ‘‘సగటు భారతీయుడు జీవితం అతని చేతుల్లోనే లేదంటూ’’ మహీంద్ర పేరిట ఒక కొటేషన్‌ వైరల్‌ అయింది. అది భారతీయుల్ని కించపరిచినట్లుగా ఉంది. ఈ ఫేక్‌ కోట్‌ తన కొలీగ్‌ ద్వారా విషయం తన దృష్టికి వచ్చిందంటూ మహీంద్ర తెలిపారు. ఇది “పూర్తిగా కల్పితం” అని అన్నారు. అంతేకాదు తాను అనని మాటల్ని అన్నట్లుగా వైరల్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ మీద లీగల్‌ యాక్షన్‌ తీసుకోనున్నట్లు ప్రకటించారు.

“ఒక సగటు భారతీయుడు తన రోజులను సోషల్ మీడియాలో మహిళలను అనుసరిస్తూ, క్రీడా జట్లపై ఆశలు పెట్టుకుని, తన కలలను పట్టించుకోని రాజకీయ నాయకుడి చేతుల్లోకి వెళుతున్నాడు” అని మహీంద్రా రాసినట్లు పోస్ట్ చేశారు. దీన్ని “స్టార్ట్_అప్‌ఫౌండర్” అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అప్‌లోడ్ చేశారు. “నేను ఎప్పుడూ అలా చెప్పలేదు” అని ఆనంద్ మహీంద్రా అన్నారు. ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’లోని నటుడు అర్షద్‌ వార్సీ ఫేమస్‌ డైలాగ్‌ మీమ్‌.. ‘కౌన్‌ యే లోగ్‌?.. కహా సే ఆతే హైన్‌?’ అంటూ ఫేక్‌ రాయుళ్లపై పంచ్‌ కూడా విసిరారు. మహీంద్రా ట్వీట్‎కు దాదాపు 10,000 ‘లైక్‌లు’ వచ్చాయి. వ్యాఖ్యల విభాగంలో అనుచరులు నకిలీ వార్తలను ఎదుర్కోవటానికి ఇతర మార్గాలు, సూచనలను అందించారు.

Read Also… Bharti Airtel: ఎయిర్‎టెల్ కస్టమర్లకు షాక్.. రీఛార్జ్ ఛార్జీలు పెంచిన కంపెనీ.. ఎంతంటే..