Bharti Airtel: ఎయిర్‎టెల్ కస్టమర్లకు షాక్.. రీఛార్జ్ ఛార్జీలు పెంచిన కంపెనీ.. ఎంతంటే..

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‎టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది.  నవంబర్ 26 నుండి ప్రీ-పెయిడ్ కస్టమర్లకు 20-25 శాతం వరకు టారిఫ్‌లను పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Bharti Airtel: ఎయిర్‎టెల్ కస్టమర్లకు షాక్.. రీఛార్జ్ ఛార్జీలు పెంచిన కంపెనీ.. ఎంతంటే..
Airtel
Follow us

|

Updated on: Nov 22, 2021 | 10:41 AM

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‎టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది.  నవంబర్ 26 నుండి ప్రీ-పెయిడ్ కస్టమర్లకు 20-25 శాతం వరకు టారిఫ్‌లను పెంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 5Gలో కొత్త పెట్టుబడులకు ముందు కంపెనీ లాభాలను పెంచుకోవడానికి టారిఫ్‎లు పెంచినట్లు తెలుస్తుంది. ప్రవేశ టారిఫ్‌ వాయిస్‌ ప్లాన్‌లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్‌ ప్లాన్లపై 25 శాతం వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU) రూ.200-300కు చేర్చాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది! అప్పుడే మూలధనంపై సహేతుకమైన రాబడి ఉంటుందని.. ఇది ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారితీస్తుందని వివరించింది. ఆర్‌పీయూ ఆదాయం పెరగడం వల్ల నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం కొనుగోళ్లలో గణనీయ పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

“ARPU నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను ఎనేబుల్ చేస్తుందని కూడా మేము నమ్ముతున్నాం.” అని కంపెనీ తెలిపింది. ఇతర ఆపరేటర్లు, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వోడాఫోన్ ఐడియా దీనిని అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీ-పెయిడ్ వాయిస్, డేటా బండిల్ ప్లాన్‌లకు మార్పులు చేస్తూ ఎయిర్‌టెల్ కనీస వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను రూ.79 నుండి రూ.99కి పెంచింది. ఛార్జీల పెంపు ప్రకటనతో ఎయిర్‌టెల్‌ షేర్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Read Also.. Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ పరిణామాలే కారణమా..

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్