Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. అంతర్జాతీయ పరిణామాలే కారణమా..
గత కొద్ది రోజులుగా నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతుండటంతో మార్కెట్ నెగిటివ్‌లో ప్రారంభం అయింది...
గత కొద్ది రోజులుగా నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతుండటంతో మార్కెట్ నెగిటివ్‌లో ప్రారంభం అయింది. ఐరోపా దేశాల్లో కరోనా కేసులు పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. జర్మనీలో ఇప్పటికే లాక్‌డౌన్ విధించగా.. ఆస్ట్రియా సహా పలు దేశాలు అదే బాటలో పయనిస్తున్నాయి. మరోవైపు గతవారం నిఫ్టీ సూచీ 50 రోజుల మూవింగ్ యావరేజీ కిందకు వెళ్లడంతో ట్రేడింగ్ బలహీనంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 10 గంటల వరకు సెన్సెక్స్ 431, నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 59,177, నిఫ్టీ 17,636 వద్ద కొనసాగుతోంది. భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్బ్యాంకు, పవర్‌గ్రిడ్, ఏసియన్ పెయింట్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. రిలయన్స్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంకు, బజాజ్ ఫిన్సెర్వ్, ఎం అండ్ ఎం షేర్లు ఎక్కువగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఫార్మా సూచీలు బలహీనంగా కొనసాగుతున్నాయి. గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన పేటీఎం షేరు ఇవాళ కూడా తగ్గింది. రియాల్టీ, ఆటో, ఆయిల్ & గ్యాస్ షేర్సు కూడా నష్టాలతో ఉన్నాయి. వీటికి తోడు అమ్మకాల ఒత్తిడి కూడా కొనసాగుతోంది.
Read Also… Investments: ఇండియాలో పెట్టుబడులు పెంచుతున్న ప్రవాసభారతీయులు.. ఎందుకంటే..