Investments: ఇండియాలో పెట్టుబడులు పెంచుతున్న ప్రవాసభారతీయులు.. ఎందుకంటే..

దేశంలో పెట్టుబడి పెట్టే ప్రవాసభారతీయుల సంఖ్య పెరుగుతుంది. HSBC మొదటి వార్షిక గ్లోబల్ ఇండియన్ పల్స్ సర్వేలో పాల్గొన్న దాదాపు 80% గ్లోబల్ ఇండియన్లు తమ నివాస దేశంలో 85% మందితో పోలిస్తే భారతదేశంలో ఏదో ఒక విధమైన పెట్టుబడులు పెడుతున్నారు...

Investments: ఇండియాలో పెట్టుబడులు పెంచుతున్న ప్రవాసభారతీయులు.. ఎందుకంటే..
Investment
Follow us

|

Updated on: Nov 22, 2021 | 9:55 AM

దేశంలో పెట్టుబడి పెట్టే ప్రవాసభారతీయుల సంఖ్య పెరుగుతుంది. HSBC మొదటి వార్షిక గ్లోబల్ ఇండియన్ పల్స్ సర్వేలో పాల్గొన్న దాదాపు 80% గ్లోబల్ ఇండియన్లు తమ నివాస దేశంలో 85% మందితో పోలిస్తే భారతదేశంలో ఏదో ఒక విధమైన పెట్టుబడులు పెడుతున్నారు. వారిలో ఎక్కువ మంది రాబోయే మూడేళ్లలో తమ పెట్టుబడి స్థాయిలను పెంచుకోవాలని భావిస్తున్నారు. వారు స్టాక్‌లు, షేర్లు 47% శాతం పెట్టుబడి పెడుతుండగా, ఆస్తులపై 46% శాతం పెట్టుబడి పెడుతున్నారు. భారతదేశంలో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు, పెట్టుబడి అవకాశాలు దేశంలో సానుకూల మార్పును ప్రోత్సహించడం పెట్టుబడులు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా, హాంకాంగ్, సౌదీ అరేబియా, యూఏఈ, యుకేలలోని ప్రవాస భారతీయులు ఇండియాలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారని నివేదిక పేర్కొంది.

పెట్టుబడులను పెంచే విషయానికి వస్తే 33% గ్లోబల్ ఇండియన్లు ఎలా పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి గురించి మరింత సమాచారం కావాలని చెప్పారు. భారతదేశంలో ఆస్తిలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఎక్కడ ఉంటుందని అడిగినప్పుడు 21 శాతం మంది ముంబైని, 9 శాతం మంది చెన్నైని, ఎంచుకున్నారు. HSBC పరిశోధన భాగస్వామి ఇంప్సోస్ మోరీ.. యూఎస్, కెనడా, UK, UAE, సౌదీ అరేబియా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలోని తొమ్మిది మార్కెట్లలో 4,152 మంది భారతీయులను సర్వే చేసింది. పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రవాస భారతీయులకు సుస్థిరత చాలా ముఖ్యమైనదని నివేదిక పేర్కొంది.

కోవిడ్-19 భారతదేశంలో పెట్టుబడుల పట్ల వైఖరిలో మార్పుకు కారణమైందని నివేదిక హైలైట్ చేసింది, 72% ప్రపంచ భారతీయులు ఈ మహమ్మారి భారతదేశంలోని స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేలా చేసిందని సర్వేలో పేర్కొన్నారు. భారతదేశంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టే వారిలో మూడవ వంతు వారు దేశంలో సానుకూల మార్పును ప్రోత్సహించే లక్ష్యంతో తమ పెట్టుబడులను ముందుగానే పెంచుకున్నారని నివేదికల పేర్కొన్నారు. భారతదేశానికి తిరిగి రావడంపై సర్వే చేసినప్పుడు. 4% మంది మాత్రమే భారతదేశాన్ని ఎన్నడూ సందర్శించలేదని, 61 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక దశలో భారతదేశంలో నివసించాలని యోచిస్తున్నారని నివేదిక తెలిపింది. ఆస్ట్రేలియా, హాంకాంగ్, సౌదీ అరేబియా, UAE, UKలలో ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండటంతో భవిష్యత్తులో భారతదేశంలో నివసించే అవకాశం మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటుందని నివేదిక పేర్కొంది.

Read Also.. Multibagger Stock: లక్ష రూపాయలు పెడితే ఆరు కోట్లు వచ్చాయి.. ఆ స్టాక్ ఏంటో తెలుసా..