Kishan Reddy: సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. బీజేపీ గెలిచింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy on CM KCR: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్లందరికీ
Kishan Reddy on CM KCR: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్లందరికీ డబ్బులు పంచారని.. పలు పార్టీల నేతలను కొనుగోలు చేశారని.. అయినా అధికార పార్టీ ఓడి పోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే అన్ని పనులు చేసినా.. బీజేపీ గెలుపును ఆపలేకపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్ లో పని చేసిందని గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో స్టేట్ సెక్రటేరియట్ ఉందా? అనే విధంగా పనిచేశారని అయినా టీఆర్ఎస్ ఆటలు సాగలేదన్నారు. దళితులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఆగం అవుతుంది, అభివృద్ధి చెందదు అని సీఎం మాట్లాడారు.. అంటే దళితులు ముఖ్యమంత్రిగా పనికి రారా? అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమవారం మాట్లాడారు. సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా మానిటరింగ్ చేసినా.. టీఆర్ఎస్ ఓటమి పాలైందని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వడ్లు, బియ్యం కొనుగోలుపై కొత్త నాటకం మొదలు పెట్టిందని తెలిపారు. కేంద్రం బాయిల్డ్ రైస్ మినహా.. అన్ని కొనుగోలు చేస్తుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వినకుండా యాసంగిపై మాట్లాడుతోందని తెలిపారు. అబద్దాలతోనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తుందన్నారు.
కాగా.. అమరావతి రాజధానిపై కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జగన్ ప్రభుత్వం ప్రజల సెంటిమెంట్ ను అర్థం చేసుకుని మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొ్న్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా.. నవంబర్ 26న రాజ్యంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు అంబేద్కర్ పంచతీర్థాల గురించి ఆన్‌లైన్లో చూపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కిషన్ రెడ్డి మీడియా సమావేశం.. Also Read: