Drugs Door Delivery: హైదరాబాద్‌ మీదుగా మాదకద్రవ్యాల రవాణా.. ఇంటర్నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీల ద్వారా విదేశాలకు..

డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టురట్టు అయ్యింది. హైదరాబాద్‌ మీదుగా విదాశాలకు డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచి కొన్ని ఇంటర్నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీల..

Drugs Door Delivery: హైదరాబాద్‌ మీదుగా మాదకద్రవ్యాల రవాణా.. ఇంటర్నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీల ద్వారా విదేశాలకు..
Drugs Door Delivery
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 22, 2021 | 2:45 PM

Drugs Door Delivery: డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టురట్టు అయ్యింది. హైదరాబాద్‌ మీదుగా విదాశాలకు డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఇక్కడి నుంచి కొన్ని ఇంటర్నేషనల్‌ కొరియర్‌ ఏజెన్సీల ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జర్మనీ తదితర దేశాలకు చేరుతున్నట్లుగా తేల్చారు. కిలోలకొద్దీ మెఫిడ్రిన్‌, ఎఫిడ్రిన్‌, సూడో ఎఫిడ్రిన్‌ దేశ సరిహద్దులు దాటింది. పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు కొద్దిరోజుల క్రితం ఫొటో ఫ్రేముల్లో ఆస్ట్రేలియాకు వెళ్తున్న రూ.5.5 కోట్ల సూడో ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నాకగాని అసలు సంగతిని గుర్తించలేక పోయారు. అది ఎక్కడి నుంచి వస్తోంది.. ఎవరు తెస్తున్నారు.. అనేది గుర్తించేపని ఉన్నారు అధికారులు. ఇదే అంశాలపై పరిశోధించగా.. ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లోని డ్రగ్స్‌ మాఫియాకు సంబంధం ఉందని ప్రథమికంగా గుర్తించారు.

ఈ ఆధారాల ద్వారా తెరవెనుక మంత్రాంగం ఎవరు నిర్వమిస్తున్నే పనిలో పడ్డారు డెరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు. మరోవైపు అమెరికాకు వస్తున్న ఎఫిడ్రిన్‌, మెఫిడ్రిన్‌లపై ఆ దేశ నేర పరిశోధన విభాగం ఆరా తీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ విభాగం అధికారులు హైదరాబాద్‌కు వచ్చి పోలీసు ఉన్నతాధికారులను కలిసి వెళ్లినట్లు సమాచారం.

అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ కామర్స్ సైట్ల ద్వారా కూడా డ్రగ్స్ ఎగుమతి అవుతున్నట్లుగా గుర్తించారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి భారీ ఎత్తన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్‌ టూ మధ్యప్రదేశ్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ వయా ఈ కామర్స్ సైట్ వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. విశాఖ నుంచి మధ్యప్రదేశ్‌కు అమెజాన్‌ ద్వారా గంజాయి స్మగ్లింగ్‌ జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.

మధ్యప్రదేశ్‌ లోని బీండ్‌లో ఆన్‌లైన్‌ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేశారు పోలీసులు. డ్రగ్స్‌ వ్యాపారం జరుగుతున్న డాబాపై పోలీసులు దాడి చేశారు. భారీ ఎత్తున డ్రగ్స్‌ను ను స్వాధీనం చేసుకున్నారు. డాబాలో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తునట్టు కూడా గుర్తించారు. డాబా యాజమానితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

విశాఖ నుంచి గత నాలుగు నెలల్లో టన్ను గంజాయిని అమెజాన్‌ ద్వారా తెప్పించినట్టు నిందితులు వెల్లడించారు. కల్లూ పవయ్యా , బ్రిజేంద్ర తోమర్‌ అనే వ్యక్తులను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వీళ్లిద్దరు అమెజాన్‌ ద్వారా దేశం లోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసినట్టు తెలుస్తోంది.

కల్లూ పవయ్య ఫేక్‌ నేమ్‌తో పాన్‌కార్డు , జీఎస్టీ నెంబర్‌ను సృష్టించి కంపెనీని నిర్వహిస్తునట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది.  ఈ కామర్స్ కంపెనీకి భారీగా కమీషన్‌ కూడా చెల్లించినట్టు చెబుతున్నారు. దీనిపై కంపెనీని వివరణ కోరినట్టు బీండ్‌ ఎస్పీ మనోజ్‌కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. నిందితుల దగ్గరి నుంచి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బాబు టెక్స్‌ అనే కంపెనీ పేరుతో నిందితులు ఆన్‌లైన్‌లో డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తునట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Fashion Tips : ఈ 3 రకాల బట్టలు కొంటున్నారా..అయితే మీరు డబ్బు వెస్ట్ చేసుకుంటున్నట్లే.. అవేంటో మీకు తెలుసా..

Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకలకు బిమ్స్‌టెక్ నాయకులు.. పాక్, చైనా కుట్రలను తిప్పికొట్టేందుకే అంటున్న విశ్లేషకులు..