Mariamma Case: మరియమ్మ లాక్ అప్ డెత్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం.. సీబీఐకి అప్పగించే అంశంపై ఎమన్నారంటే..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్ డెత్ కేసుపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన దళిత మహిళ మరియమ్మ మృతిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
Mariamma Lock-up Death Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్ డెత్ కేసుపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన దళిత మహిళ మరియమ్మ మృతిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న బాధితుల డిమాండ్ విషయాన్ని కూడా రిజర్వ్‌లో ఉంచింది. హైకోర్టులో మరియమ్మ లాకప్‌డెత్ కేసు ఇవాళ విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశం మేరకు ఇవాళ రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సైతం విచారణకు హాజరయ్యారు. అయితే.. ఈ కేసులో ఇద్దరు పోలీసు అధికారులను తొలగించామని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ కేసు విచారణ సవ్యంగానే సాగుతుందని.. ఎలాంటి అనుమానాలు లేవని.. ఈ దశలో కేసును సీబీఐకి అప్పగిస్తే తెలంగాణ పోలీసులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని కోర్టు తెలిపింది.
ఇదిలావుంటే, యాదాద్రి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఈ ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనలు వ్యక్తం చేసి ప్రభుత్వంపై ఒత్తిడికి తీసుకువచ్చాయి. దీంతో ప్రభుత్వం బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని హామీ ఇచ్చింది. కాగా ఈ కేసులను సీబీఐకి అప్పగించే విషయంపై తీర్పును రిజర్వు చేసింది. విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక విషయాలు కోర్టు వెల్లడించింది.
పోలీసుల తరపున హైకోర్టుకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హాజరయ్యారు. హైకోర్టుకు సీబీఐ ఎస్పీ కళ్యాణ్, ఐబీ అధికారి సంబంద్ హాజరయ్యారు. కాగా, మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించే అంశం పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తదుపరి విచారణలో కోర్టు తీర్పును వెల్లడించింది. బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ఏజీని ప్రశ్నించింది.
Read Also… SBI Customers Alerts: కస్టమర్ కేర్‌కు కాల్ చేసే SBI ఖాతాదారులకు ముఖ్య గమనిక!