Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకలకు బిమ్స్‌టెక్ నాయకులు.. పాక్, చైనా కుట్రలను తిప్పికొట్టేందుకే అంటున్న విశ్లేషకులు..

వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అతిథుల జాబితా తయారీ మొదలైంది. న్యూఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్..

Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకలకు బిమ్స్‌టెక్ నాయకులు.. పాక్, చైనా కుట్రలను తిప్పికొట్టేందుకే అంటున్న విశ్లేషకులు..
Pm Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 22, 2021 | 10:59 AM

Republic Day 2022: వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు అతిథుల జాబితా తయారీ మొదలైంది. న్యూఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) నాయకులను ఆహ్వానించడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశం కాకుండా  ఏడు దేశాల ఉప-ప్రాంతీయ సమూహంలో బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ ఉన్నాయి. మే 2019లో రెండవ పదవీకాలం ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి BIMSTEC నాయకులు హాజరయ్యారు. అయితే అప్పటి నుండి ఈ దేశాలలో కొన్నింటిలో నాయకత్వ మార్పు జరిగాయి.

ఈ దేశాల నాయకుల కార్యాలయంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అనేక సముచిత మార్గాల ద్వారా సందేశం పంపబడిందని సోర్సెస్ తెలిపింది. నాయకులు అందుబాటులో ఉన్నారని నిర్ధారించిన తర్వాతే రిపబ్లిక్ డే అతిథుల జాబితాను ప్రకటిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం విదేశీ నాయకుడు అందుబాటులో ఉన్నారని నిర్ధారించబడిన తర్వాత మాత్రమే ఆహ్వాన లేఖ పంపిస్తారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావాలన్న ఆహ్వానం పంపించడం.. భారత ప్రభుత్వానికి చాలా సింబాలిక్ ప్రాముఖ్యత కలిగి ఉంది.

ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఆహ్వానించే ముఖ్య అతిథిల జాబితా తాయరు చేయడం.. వారిని ఎంపిక చేయడం ఓ వ్యూహాత్మకగా, దౌత్యపరమైన ప్రముఖ్యతతో కూడుకొని ఉంటుంది. ఇందులో వ్యాపార ప్రయోజనాలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలతో సహా అనేక అంశాలను విశ్లేషించిన తర్వాతే వారిని ఎంపిక చేస్తుంటుంది భారత ప్రభుత్వం. 

ఆ నాయకులు వీరే..   భారతదేశం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స లేదా ప్రెసిడెంట్ గోటాభాయ రాజపక్స, నేపాల్ ప్రధాన మంత్రిగా షేర్ బహదూర్, భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్, థాయిలాండ్ ప్రధాన మంత్రి ప్రయుత్ చాన్-ఓ-చా, కౌన్సిల్ ఆఫ్ అప్పీల్స్ కౌన్సిల్. మయన్మార్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ప్రెసిడెంట్ జనరల్ మిన్ ఆంగ్ హులింగ్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి: Kinnera player Mogilaiah: ఆర్టీసీ బస్సు తల్లిలాంటిది.. మొగులయ్య పాటను షేర్ చేసిన సజ్జనార్..

PNB: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. కస్టమర్ల ఐడీ, పాస్‌వర్డ్‌ లీక్..