AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. కస్టమర్ల ఐడీ, పాస్‌వర్డ్‌ లీక్..

PNB ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ లాంటి విలువైన డేటా లీకైంది. బ్యాంక్‌ మాత్రం అలాంటిదేమీ లేదంటోంది.

PNB: ఆ బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్‌ న్యూస్‌.. కస్టమర్ల ఐడీ, పాస్‌వర్డ్‌ లీక్..
Pnb
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 22, 2021 | 12:17 PM

Share

పంజాబ్‌ నేనల్‌ బ్యాంక్‌ సర్వర్‌లో లోపం బయటపడడంతో ఖాతాదారులను ఆందోళనకు గురిచేస్తోంది. సుమారు 18 కోట్ల మంది ఖాతాదారులకు సంబంధించిన సమాచారం ఏడు నెలలుగా లీక్‌ అవుతున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సైబర్‌ ఎక్స్‌9 ప్రకటించింది. బ్యాంక్‌కు సంబంధించిన డిజిటల్‌ బ్యాంకింగ్‌కు వ్యవస్థ మొత్తాన్ని యాక్సెస్‌ చేసే అవకాశాన్ని సర్వర్‌లోని లోపం కల్పించిందంటోంది సైబర్‌ ఎక్స్‌9. అయితే, సర్వర్‌లో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ ఉన్నా.. అకౌంట్‌ హోల్డర్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అంటోంది. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్‌ చేశామంటోంది.

ఖాతాదారుల సమాచారం లీక్‌ అయిన విషయాన్ని CERT-In, NCIIPCకి కూడా తెలియజేశామన్నారు సైబర్‌ ఎక్స్‌9 ఎండీ హిమాన్షు పాతక్. సైబర్‌ దాడులకు వీలు కల్పించే విధంగా ఈ లోపం ఉందని, అడ్మిన్‌ యాక్సెసబిలిటీ సైతం అందించేవిధంగా ఈ లోపాన్ని గుర్తించామన్నారు.

ఆన్‌-ప్రిమ్‌ నుంచి ఆఫీస్‌ 365 క్లౌడ్‌లోకి ఈ-మెయిల్స్‌ను రూట్‌ చేయడానికి మాత్రమే ఆ సర్వర్‌ను వినియోగిస్తున్నామంది పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌. సైబర్‌ ఎక్స్‌9 చెప్పినట్లుగా ఖాతాదారుల డేటా లీక్‌ అవ్వడం తప్పంటోంది.

ఎప్పటికప్పుడు Cert-in ఎంప్యానెల్డ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆడిటర్లు తనిఖీ చేస్తూనే ఉన్నారని PNB అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సర్వర్‌ను షట్‌డౌన్‌ చేశామన్నారు.

అంతర్గత సర్వర్‌లకు

ఈ లోపం గురించి సైబర్‌ఎక్స్ 9 వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ..మేము దీని గురించి ఫిర్యాదు చేయనంత వరకు బ్యాంక్ ప్రశాంతంగా నిద్రపోతోంది. దాదాపు ఏడు నెలల పాటు  180 మిలియన్ల కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక డేటా రాజీ పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్‌లోని తీవ్రమైన లోపాన్ని మా బృందం బయటపెట్టిందని ఆయన అన్నారు. అంతర్గత సర్వర్‌కు యాక్సెస్‌ని అందించిన ఈ లోపం కారణంగా అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణ రాజీ పడింది. ఇంటర్నల్ సర్వర్ యాక్సెస్ కారణంగా కస్టమర్ల డేటా ఇంత పెద్ద ఎత్తున రాజీ పడింది.

నవంబర్ 19న..

సైబర్ X9 చేసిన ఆరోపణలను PNB  తీవ్రంగా ఖండించింది. సాంకేతిక లోపం నిజమేనని.. అయితే ఒక్క కస్టమర్ వ్యక్తిగత లేదా ఆర్థిక డేటా కూడా లీక్ కాలేదని ఆయన స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సర్వర్ షట్ డౌన్ చేయబడిందని వెల్లడించింది. సైబర్ X9 ఈ లోపం గురించి NCIIPCకి తెలియజేసిందని.. నవంబర్ 19న ఈ ప్రకటన వెలువడింది.

ఇవి కూడా చదవండి: How to Clean: మీ ఇంట్లోని ఫ్రిజ్‌ అలా ఉంటే రోగాల బారిన పడినట్లే.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి..

Net Banking Fraud: నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి