How to Clean: మీ ఇంట్లోని ఫ్రిజ్‌ అలా ఉంటే రోగాల బారిన పడినట్లే.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి..

రిఫ్రిజిరేటర్‌ని వారంలో ఒక రోజు శుభ్రం చేయవలసిన అవసరం ఉంది. రిఫ్రిజిరేటర్ శుభ్రంగా లేకపోతే దానిలో..

How to Clean: మీ ఇంట్లోని ఫ్రిజ్‌ అలా ఉంటే రోగాల బారిన పడినట్లే.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి..
How To Clean Refrigerator
Follow us

|

Updated on: Nov 22, 2021 | 7:36 AM

How to Clean Refrigerator: ఈ మధ్య కాలం మధ్యతరగతి అందరి ఇళ్లలో ఫ్రిజ్ కనిపిస్తోంది. ఆ ఫ్రిజ్‌ను భయట వైపు చాలా అందంగా అలంకరిస్తుంటారు. దానిపై ఓ క్లాత్ పెట్టి.. దానిపై అందంగా కనిపించేందుకు ఫోటో అలా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడి వరకు అంతా బాగున్నా.. ఇన్‌సైడ్ మాత్రం అన్ని రకాల వస్తువులను నిల్వ చేస్తుంటారు. అయితే.. ఎలాంటి వస్తువులను దాని నిల్వ చేసుకోవాలో.. చేసుకోవద్దు అని చూడకుండా దానిని నింపేస్తారు. అంతేకాదు అలా నిల్వ చేయడం వల్ల అది అపరిశుభ్రంగా మారిపోతుంది. రిఫ్రిజిరేటర్‌ని వారంలో ఒక రోజు శుభ్రం చేయవలసిన అవసరం ఉంది. రిఫ్రిజిరేటర్ శుభ్రంగా లేకపోతే దానిలో పెట్టె ఆహార పదార్ధాలు తొందరగా చెడిపోతాయి. ఇది సూక్ష్మజీవులకు నిలయంగా మారిపోతాయి.

మన ఇంట్లో ఫిజ్ ఉందంటే దానిని వారంలో ఒకసారైన శుభ్రం చేస్తుండాలి.. మనం గుర్తించలేకపోయిన  రిఫ్రిజిరేటర్ గోడలు, కంపార్ట్మెంట్‌లు ఆహారాన్ని కలుషితం చేసే లేదా ఆహారాన్ని వేగవంతంగా కుళ్లిపోయేలా చేస్తుంటాయి. అయితే శుభ్రం చేసేందుకు చాలా సార్లు ఖరీదైన లేదా ఘాటైన రసాయనాలను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల మీ రిఫ్రిజిరేటర్‌ని శుభ్రం చేయటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఇంటిలో సులభంగా సహజమైన పద్ధతుల్లో రిఫ్రిజిరేటర్‌ని శుభ్రం చేసుకోవటానికి నాలుగు సులువైన చవకైన పరిష్కారాలు ఉన్నాయి.

బేకింగ్ సోడా సోడియం బైకార్బొనేట్‌లో..

బేకింగ్ సోడాలో క్రిమిసంహారక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మీ ఫ్రిజ్‌ని శుభ్రపరచటానికి క్రిమిసంహారక ఉత్తమ పరిష్కారాలలో ఒకటి. బేకింగ్ సోడా రిఫ్రిజిరేటర్ లోపల అంటుకుని దుర్వాసనలు వస్తుంటుంది. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని తొలగిస్తుంది. శుభ్రం చేసేందుకు కావలసినవి బేకింగ్ సోడా, వెచ్చని నీరు అవసరమవుతుంటాయి. ఒక బౌల్ తీసుకుని అందులో కొన్నిగోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో బేకింగ్ సోడా వేయండి.. మంచిగా కలిపిన తర్వాత ఓ స్పాంజ్ లేదా స్కౌరింగ్ ప్యాడ్ తీసుకుని.. రెండు బాగా కలిసేలా కలపాలి. స్కోరింగ్ ప్యాడ్ ని ముంచి మీ రిఫ్రిజిరేటర్ గోడలు , కంపార్ట్మెంట్ల మీద రుద్దాలి. 5 నిముషాల పాటు ఆలా వదిలేయాలి. ఆ తర్వాత ఇంకే వస్త్రంతో తుడవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.

నిమ్మరసంతో..

నిమ్మ రసంలో ఉండే సహజ ఆమ్లాలు బ్యాక్టీరియా, ధూళిని తొలగించే శక్తివంతమైన శుభ్రపరిచే ఏజెంట్లుగా పనిచేస్తాయి. నిమ్మరసం సహజ లక్షణాలు రిఫ్రిజిరేటర్ ఉపరితలం దోషరహితంగా వాసనలు లేకుండా చేస్తాయి. కావలసినవి నిమ్మకాయలు – 3 (జ్యుస్ తీయాలి) వెచ్చని నీరు – 2 కప్పులు (500 మి.లీ) సామాగ్రి స్ప్రే సీసా శుభ్రమైన టవల్ లేదా వస్త్రం తయారీ నిమ్మకాయల నుండి రసాన్ని పిండి వేడి నీటిలో కలిపి ఒక స్ప్రే సీసాలో పోయాలి. బాగా కలపాలి. ఆ తర్వాత.. రిఫ్రిజిరేటర్ నుండి అన్ని ఆహారాలను వస్తువులను తీసి నిమ్మ ద్రావణాన్ని స్ప్రే చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు శుభ్రమైన టవల్ లేదా వస్త్రంతో తుడవండి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

వైట్ వెనిగర్ రిఫ్రిజిరేటర్..

లోపల వెలుపల శుభ్రం చేయటానికి వైట్ వెనిగర్ పర్యావరణానికి అనుకూలమైన ద్రావణం. వైట్ వెనిగర్‌కి ఉపరితలంపై పొడిగా ఉన్న ఆహార అవశేషాలను లేదా వ్యర్ధాలను తొలగించే లక్షణం ఉంటుంది. ముందుగా వెచ్చని నీటిలో వైట్ వెనిగర్ కలిపి స్ప్రే సీసాలో పోయాలి. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్‌ని ఖాళీ చేసి శుభ్రం చేయదలిచిన అన్ని గోడలు, ఉపరితలాలపై వినెగర్‌ని స్ప్రే చేయాలి. ఆ తర్వాత 5 నిముషాల పాటు ఇంకే వస్త్రంతో రుద్దాలి. కనీసం వారానికి ఒకసారి ఈ విధంగా చేయాలి.

ఆలివ్ నూనె, నిమ్మ నిమ్మకాయ..

ఆలివ్ నూనె స్టెయిన్ లెస్ స్టీల్ రిఫ్రిజిరేటర్‌ పరితలాలను శుభ్రం చేయటానికి చాలా ఆదర్శంగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ భాగాలు దెబ్బతీయకుండా జిడ్డైన అవశేషాలను, దుమ్ము , వ్యర్ధాల నుండి శుభ్రం చేయవచ్చు. ఒక ప్లేట్ లేదా ఇతర కంటైనర్లో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం తీసుకోవాలి.. అలా తీసుకున్న ద్రావణంను రిఫ్రిజిరేటర్ ఉపరితలంపై  మృదువైన వస్త్రం సహాయంతో తుడవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా తడి వస్త్రంతో తుడవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి.

ఎలా ఉపయోగించాలి ద్రవాన్ని బాగా షేక్ చేసి రిఫ్రిజిరేటర్ గోడలపై స్ప్రే చేయాలి. మైక్రో ఫైబర్ వస్త్రంతో తుడవాలి. ఈ విధంగా వారంలో 2 లేదా 3 సార్లు చేయాలి. శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఇంకా రిఫ్రిజిరేటర్ ని శుభ్రం చేయకపోతే ఈ పద్ధతుల్లో సులభంగా శుభ్రం చేసుకోండి.

ఇవి కూడా చదవండి: BJP – TMC: సినీ నటి సయోనిఘోష్‌ అరెస్ట్‌.. బెంగాల్‌ తరహా లోనే త్రిపురలో బీజేపీ – టీఎంసీ వార్..

Rajasthan Cabinet: సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య రాజీ.. రాజస్తాన్ కేబినెట్‌లో 15 మందికి కొత్తగా అవకాశం..