Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kolkata-Mumbai: యూఏఈలో సందడి చేయనున్న ముంబై, కోల్‌కతా టీంలు.. సిద్ధమైన ఈపీఎల్ టీ20 లీగ్..!

కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని జట్లు త్వరలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడబోతున్నాయి. ECB (ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) లీగ్ కోసం ఆరు జట్లను..

Kolkata-Mumbai: యూఏఈలో సందడి చేయనున్న ముంబై, కోల్‌కతా టీంలు.. సిద్ధమైన ఈపీఎల్ టీ20 లీగ్..!
Emirates Premier League T20
Follow us
Venkata Chari

|

Updated on: Nov 22, 2021 | 2:21 PM

Emirates Premier League T20: కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని జట్లు త్వరలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడబోతున్నాయి. ECB (ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు) లీగ్ కోసం ఆరు జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ముంబై, కోల్‌కతాలతో ఒప్పందాలు దాదాపుగా ఫైనల్ అయ్యాయి. జనవరి-ఫిబ్రవరిలో లీగ్‌ని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. అయితే, లీగ్ మొదటి సీజన్ వచ్చే ఏడాది మొదలుకానుంది.

ఈసీబీ ఈ ఏడాది ఆగస్టులో ప్రీమియర్ టీ20 లీగ్‌ని ప్రకటించింది. అయితే, అప్పుడు లీగ్ గురించి తదుపరి సమాచారం మాత్రం ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. బోర్డు ఆరు జట్లతో ప్రారంభించాలని నిర్ణయించింది. ఈఎస్‌పీఎన్ వార్తల ప్రకారం, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ యజమానులు బోర్డుతో చర్చలు దాదాపు పూర్తయ్యాయని తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు పేర్కొంది.

రేసులో ప్రముఖ కంపెనీలు.. వీరే కాకుండా కాప్రీ గ్లోబల్ కూడా ఓ జట్టును కొనుగోలు చేసే రేసులో పాల్గొంది. ఈ కంపెనీ కూడా ఐపీఎల్ టీమ్‌ని కొనుగోలు చేసేందుకు బిడ్ వేసినప్పటికీ విజయం సాధించలేకపోయింది. బిగ్ బాష్ లీగ్ జట్టు సిడ్నీ సిక్సర్స్ యజమాని, ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని కిరణ్ కుమార్ కూడా ఓ జట్టును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. మొత్తం ఆరు కాంట్రాక్టులు జట్లకు ఇచ్చామని, ఇప్పుడు వాటిపై తుది చర్చలు జరుగుతున్నాయని ఈసీబీ అధికారి తెలిపారు. ఆర్థిక విషయాలపై చర్చలు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

లీగ్ తొలి చర్చలో చెన్నై సూపర్ కింగ్స్ యజమానులు కూడా పాల్గొన్నారు. ఐపీఎల్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందర్ రామన్ లీగ్ వ్యూహాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యారు. మాంచెస్టర్ యునైటెడ్ యజమాని గ్లేజర్ కూడా ఈ లీగ్ సహాయంతో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

ఆరు జట్లతో లీగ్.. ప్రాథమిక సమాచారం ప్రకారం, లీగ్‌లోని మ్యాచ్ డబుల్ రౌండ్ రాబిన్‌లో ఉండనున్నాయి. ఇందులో 34 మ్యాచ్‌లు ఉంటాయి. వీటిలో నాలుగు జట్లు క్వాలిఫయర్లు, ఎలిమినేటర్, ఫైనల్ ఆడనున్నాయి. ఆటగాళ్లను వేలంలో తీసుకుంటారా లేక డ్రాఫ్ట్‌లో తీసుకుంటారా అనేది ఇంకా నిర్ణయించలేదు. యూఏఈలో టీ20 లీగ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు డిసెంబర్ 2018లో ఏబీ డివిలియర్స్, ఆండ్రీ రస్సెల్ వంటి ఆటగాళ్లు పాల్గొనే t20x పేరుతో ECB లీగ్ ప్రారంభించింది. అయితే, ఈ లీగ్ ప్రారంభానికి ఒక నెల ముందు రద్దు చేశారు. ఎందుకంటే ఐదు జట్లలో కేవలం రెండు మాత్రమే వచ్చాయి.

Also Read: 6 ఫోర్లు, 2 సిక్సర్లు.. 253 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బ్రావో సుడిగాలి ఇన్నింగ్స్‌‌తో తేలిపోయిన బౌలర్లు..!

IND vs NZ: ఈ ఫొటోలో రోహిత్‌ పక్కన ఉన్నది ఎవరో తెలుసా.. 15 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టీమిండియా బౌలర్?