6 ఫోర్లు, 2 సిక్సర్లు.. 253 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బ్రావో సుడిగాలి ఇన్నింగ్స్‌‌లో కొట్టుకుపోయిన బౌలర్లు..!

Dwayne Bravo: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ప్రయాణం ముగిసిన వెంటనే డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ అతను ఫ్రాంచైజీ క్రికెట్‌లో మెరుస్తూనే ఉన్నాడు.

6 ఫోర్లు, 2 సిక్సర్లు.. 253 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్.. బ్రావో సుడిగాలి ఇన్నింగ్స్‌‌లో కొట్టుకుపోయిన బౌలర్లు..!
T10 League
Follow us
Venkata Chari

|

Updated on: Nov 22, 2021 | 2:25 PM

T10 League: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ప్రయాణం ముగిసిన వెంటనే డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ, అతను ఫ్రాంచైజీ క్రికెట్‌లో మెరుస్తూనే ఉన్నాడు. అతని ఆల్ రౌండ్ ప్రదర్శన ప్రత్యర్థి జట్లపై కొనసాగుతూనే ఉంది. టీ10 లీగ్‌లో కూడా ఇలాంటిదే కనిపించింది. ఇక్కడ చెన్నై బ్రేవ్స్, ఢిల్లీ బుల్స్ ముఖాముఖిగా తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్రేవ్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. చెన్నై బ్రేవ్స్ తరపున భానుక రాజపక్సే 31 బంతుల్లో అజేయంగా 64 పరుగులు చేశాడు. 206.45 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా రవి బొపారా 11 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో ఢిల్లీ బుల్స్ తమ 7గురు బౌలర్‌లను ప్రయత్నించారు. అందులో డ్వేన్ బ్రావో 2 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 22 పరుగులు ఇచ్చాడు.

17 బంతులు, 43 పరుగులు, 8 బౌండరీలు.. బంతితో వికెట్ తీయడంలో బ్రావో విఫలమైనప్పటికీ, బ్యాట్‌తో తుఫాను ఇన్నింగ్స్‌ ఆడాడు. 17 బంతులు ఆడిన బ్రావో.. 8 బంతుల్లో విధ్వంసం చేశాడు. బ్రావో ఇన్నింగ్స్‌తో 10 ఓవర్లలో 125 పరుగుల లక్ష్యం కూడా మరుగున పడింది. డ్వేన్ బ్రావో 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 253 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులు చేశాడు. అంటే, అతను తన ఇన్నింగ్స్‌లో కేవలం 8 బౌండరీలతో 36 పరుగులు చేశాడు.

అయితే 10 ఓవర్లలో 125 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బుల్స్ అందుకుంది. కానీ, బ్రావో ఇన్నింగ్స్ కారణంగా, ఈ లక్ష్యాన్ని 2 బంతుల ముందే సాధించారు. ఢిల్లీ బుల్స్ తరఫున బ్రావోతో పాటు ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు. చెన్నై బ్రేవ్స్ మ్యాచ్‌లో మొత్తం 5 మంది బౌలర్లను ప్రయత్నించారు. అయితే బ్రావో తుఫాను ముందు అందరూ తేలిపోయారు.

Also Read: Shoaib Akhtar: నేను పరుగెత్తే రోజులు ముగిశాయి: భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్

IND vs NZ: ఈ ఫొటోలో రోహిత్‌ పక్కన ఉన్నది ఎవరో తెలుసా.. 15 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టీమిండియా బౌలర్?