Shoaib Akhtar: నేను పరుగెత్తే రోజులు ముగిశాయి: భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్

ప్రపంచ క్రికెట్‌లో స్పీడ్‌స్టర్‌గా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్.. ఎంతో వేగంతో బంతులను సంధిస్తాడనే విషయం తెలిసిందే. అయితే ఇకనుంచి ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీయలేడు..

Shoaib Akhtar: నేను పరుగెత్తే రోజులు ముగిశాయి: భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్
Shoaib Akhtar
Follow us

|

Updated on: Nov 22, 2021 | 1:22 PM

Shoaib Akhtar: ప్రపంచ క్రికెట్‌లో స్పీడ్‌స్టర్‌గా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్.. ఎంతో వేగంతో బంతులను సంధిస్తాడనే విషయం తెలిసిందే. అయితే అతని వేగం కారణంగా ప్రపంచం అతన్ని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తుంది. అతని కాలంలో బ్యాట్స్‌మెన్లను భయాందోళనకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. షోయబ్ రన్ అప్‌ను చూసే బ్యాట్స్ మెన్ కంగారు పడేవాడు. అయితే క్రికెట్ ఫీల్డ్‌లో భయాందోళనలు సృష్టించిన షోయబ్ అక్తర్ గురించి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు వింటే షాక్ అవ్వాల్సిందే. ఈ వార్తలను అక్తర్ స్వయంగా ధృవీకరించడంతో ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

షోయబ్ అక్తర్ ప్రస్తుతం పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ నుంచి మాజీ ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. అయితే అతని స్పీడ్‌కి తగ్గట్టు ప్రపంచ క్రికెట్‌లో ఇంతవరకు ఎవరూ రాలేదు. అయితే ఇకనుంచి ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ పరుగులు తీయలేడు.

నా పరుగెత్తే రోజులు ముగిశాయి: షోయబ్ అక్తర్.. షోయబ్ అక్తర్ ఇకపై ఎప్పటికీ పరిగెత్తలేనని సోషల్ మీడియాలో ఓ పోస్టును పంచుకున్నాడు. అతను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో తనకు జరిగిన ఆపరేషన్‌ వివరాలను వెల్లడిస్తూ భావోద్వేగంతో అభిమానులతో ఈ వార్తను పంచుకున్నాడు. మెల్‌బోర్న్‌లో తన మోకాళ్లకు ఆపరేషన్ జరుగుతున్నట్లు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ పేర్కొన్నాడు. ఈమేరకు త్వరలో ఆస్ట్రేలియా వెళ్లబోతున్నట్లు వివరించాడు.

224 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. షోయబ్ అక్తర్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. పాకిస్తాన్ అధికారిక ఛానెల్ పీటీవీ స్పోర్ట్స్ యాంకర్ నౌమన్ నియాజ్‌తో వివాదం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ లైవ్‌ టీవీ షోలోనే తన రాజీనామాను ప్రకటించాడు. అయితే, ఆ తర్వాత యాంకర్ నౌమన్ నియాజ.. అక్తర్‌కు క్షమాపణలు చెప్పడంతో ఈవివాదానికి తెర పడింది. అక్తర్ 2011లో అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైరయ్యాడు. పాకిస్థాన్ తరఫున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టెస్టు మ్యాచ్‌ల్లో అక్తర్ 25.69 సగటుతో 178 వికెట్లు తీశాడు. వన్డే ఇంటర్నేషనల్‌లో అక్తర్ 24.97 సగటుతో 247 వికెట్లు పడగొట్టాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో అక్తర్ 22.73 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు.

Also Read: India A Squad: దక్షిణాఫ్రికాతో రెడ్ బాల్ సిరీస్‌ ఆడనున్న ఆ ఇద్దరు.. బీసీసీఐ కీలక నిర్ణయం.. 23న ప్రయాణం

IPL 2022: స్టార్, సోనీలకు చెక్ పెట్టనున్న జియో.. ఐపీఎల్ ప్రసారాల కోసం బరిలోకి..!