AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: స్టార్, సోనీలకు చెక్ పెట్టనున్న జియో.. ఐపీఎల్ ప్రసారాల కోసం బరిలోకి..!

IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ ఇప్పటికే ఆలస్యమైంది. అక్టోబరు చివరిలో రెండు కొత్త ఐపీఎల్ జట్లను ప్రకటించిన తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

IPL 2022: స్టార్, సోనీలకు చెక్ పెట్టనున్న జియో.. ఐపీఎల్ ప్రసారాల కోసం బరిలోకి..!
IPL 2022
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 22, 2021 | 12:20 PM

Share

IPL Media Rights: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల టెండర్ ఇప్పటికే ఆలస్యమైంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబరు చివరిలో రెండు కొత్త ఐపీఎల్ జట్లను ప్రకటించిన తర్వాత త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. అయితే ఈ టెండర్‌ను వచ్చే నెలలో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

“2023-2027 కోసం IPL మీడియా హక్కుల టెండర్ రెండు కొత్త IPL జట్ల నియామకం తర్వాత ప్రారంభిస్తాం” అని 25 అక్టోబర్ 2021న బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 28న IPL గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత బీసీసీఐ మీడియా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బీసీసీఐ రెండు కొత్త జట్లను ప్రకటించి దాదాపు నెల రోజులు కావస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు ఓ క్లారిటీ రాలేదు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, టెండర్ జారీలో జాప్యానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ మీడియా హక్కుల టెండర్ ద్వారా బీసీసీఐ దాదాపు రూ. 30,000 కోట్లు తన ఖాతాలో వేసుకోనుందని తెలుస్తోంది.

అహ్మదాబాద్ ఫ్రాంచైజీ CVC స్పోర్ట్స్‌పై సందిగ్ధత.. 10వ IPL ఫ్రాంచైజీకి సంబంధించి ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని CVC స్పోర్ట్స్ గెలుచుకున్నట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారి బిడ్ ఇప్పటికీ సందేహంలో ఉందంట. దీని కారణంగా బీసీసీఐ ద్వారా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇంతవరకు జారీ కాకపోవడమేనని సమాచారం.

ఈ-వేలమా లేదా క్లోజ్డ్ బిడ్డింగ్‌కు వెళ్లాలా.. మీడియా ప్రసార హక్కులకు సంబంధించిన ఈ వేలమా లేదా క్లోజ్డ్ బిడ్డింగ్‌కు వెళ్లాలా అనే సందిగ్ధంలో బీసీసీఐ కూరకపోయిందంట. క్లోజ్డ్ బిడ్‌ అయితే బెటర్ అనే వాదనలో ఉన్నట్లు సూచనాప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదే ప్రక్రియ ప్రాంచైజీల కోనుగోలులో జరగడంవల్ల బీసీసీఐ చాలా లాభపడింది. ఉదాహరణకు సంజీవ్ గోయెంకా RPSG గ్రూప్‌ లక్నో ఫ్రాంచైజీని గెలుచుకోవడానికి రూ. 7090 కోట్లకు బిడ్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో దాని సమీప ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఈ బిడ దాఖలు చేసి విజయం సాధించింది. ఇది రెండో అత్యధిక బిడ్డర్ గ్రూప్ కంటే రూ.1500 కోట్లు ఎక్కువగా ఉంది.

ఇ-వేలం విషయంలో అత్యధిక బిడ్ సమీప పోటీదారు కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇ-బిడ్డింగ్ దాని ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. స్టార్, సోనీ-జీ, రిలయెన్స్ జియో ప్రముఖంగా బిడ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటి మధ్య పోటీ తీవ్రతరం కానుందని తెలుస్తోంది. ఈ మూడు కూడా భారీ బిడ్లను సమర్పించే అవకాశం ఉండడంతో బీసీసీఐకు లాభాల పంట పడనుందని తెలుస్తోంది.

బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం.. బీసీసీఐ వార్షిన సర్వసభ్య సమావేశం (AGM) డిసెంబర్ 4న నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సమావేశంలో, ముగ్గురు కొత్త సభ్యులను చేర్చడం ద్వారా IPL నూతన పాలక మండలి ఏర్పాటు కానుంది. ఇది పూర్తయ్యాకే మీడియా ప్రసార హక్కులకు బిడ్లను ఆహ్వనించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: I‍ND vs NZ: పాదాలను నేలపైనే ఉంచండి.. విజయ గర్వం తలకెక్కితే ఇక అంతే: ఆటగాళ్లకు రాహుల్ ద్రవిడ్ హెచ్చరిక

Unmukt Chand Marriage: పెళ్లిపీటలెక్కిన ఉన్ముక్త్ చంద్.. ఈ క్రికెటర్‌ని ‘క్లీన్‌బౌల్డ్‌’ చేసిన ఆమె ఎవరంటే?