AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

I‍ND vs NZ: పాదాలను నేలపైనే ఉంచండి.. విజయ గర్వం తలకెక్కితే ఇక అంతే: ఆటగాళ్లకు రాహుల్ ద్రవిడ్ హెచ్చరిక

Rahul Dravid: న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రోహిత్ సేన 3-0తో విజయం సాధించింది. కోచ్ రాహుల్ ద్రవిడ్ హయాంలో ఇదే తొలి సిరీస్ విజయం. విజయం అనంతరం రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా ప్రదర్శన గురించి మాట్లాడుతూ..

I‍ND vs NZ: పాదాలను నేలపైనే ఉంచండి.. విజయ గర్వం తలకెక్కితే ఇక అంతే: ఆటగాళ్లకు రాహుల్ ద్రవిడ్ హెచ్చరిక
Rahul Dravid
Venkata Chari
|

Updated on: Nov 22, 2021 | 11:04 AM

Share

Ind vs Nz, Rahul Dravid: కోల్‌కతాలో జరిగిన ఫైనల్ టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో రోహిత్ సేన 3-0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారిన రోహిత్ శర్మ, కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో టీమిండియాకు ఇదే తొలి విజయం. అయితే, విజయానంతరం రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘శుభారంభం చేయడం ఎప్పుడూ మంచిదే. అయితే ఈ సిరీస్‌లో అందరూ బాగా ఆడారని, ఈ విజయం తర్వాత కూడా మన పాదాలను నేలపై నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని’ టీం సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

‘ఇది గొప్ప సిరీస్ విజయం. సిరీస్‌లో అందరూ బాగా ఆడారు. విజయంతో ప్రారంభించడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మనం వాస్తవికతను చూడాలి. గెలిచిన తర్వాత ధీమా పెరిగితే, తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని పేర్కొన్నాడు.

షెడ్యూల్‌పై మాట్లాడుతూ.. ప్రపంచకప్ ముగిసిన వెంటనే మూడు రోజుల్లో ఇక్కడకు వచ్చి మ్యాచ్ ఆడడం వల్ల న్యూజిలాండ్‌కు ఇది అంత సులభం కాదని అన్నాడు. అలాంటప్పుడు 6 రోజుల్లో 3 టీ20 మ్యాచ్‌లు ఆడడం అంత ఈజీ కాదు. ఈ సిరీస్ నుంచి మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని’ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

ఈ సిరీస్ తర్వాత ప్రయాణం గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ, ‘రాబోయే 10 నెలల్లో మనం ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ప్రపంచకప్‌కు ముందు నిరంతర క్రికెట్ ఉండాలని అన్నారు. అటువంటి పరిస్థితిలో ఆటగాళ్లలోని అనేక హెచ్చు తగ్గులను ఓ అంచనా వేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే కొత్త ఆటగాళ్లతో నిలకడగా రాణించడమే జట్టుకు మేలు. చాలా మంది ఆటగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు’ అని తెలిపాడు.

నవంబర్ 14న యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్ ఆడింది. అందులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని తర్వాత, సిరీస్‌లోని మొదటి టీ20 మ్యాచ్ నవంబర్ 17 న జైపూర్‌లో జరిగింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు కూడా నవంబర్ 19, 21 తేదీల్లో జరిగాయి. కేన్ విలియమ్సన్ కూడా టీ20 సిరీస్‌లో పాల్గొనకపోవడానికి బిజీ షెడ్యూలే కారణమని తెలుస్తోంది.

టెస్‌ సిరీస్‌ అసలైన పరీక్ష.. టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న తర్వాత ద్రవిడ్ దృష్టి నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్న తొలి టెస్టుపైనే ఉంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కాన్పూర్‌లో ప్రారంభం కానుంది. జూన్‌లో జరిగిన చివరి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత, భారత జట్టు మొదటిసారి కివీ జట్టుతో తలపడుతుంది. ఆ ఓటమిని భర్తీ చేయాలనుకుంటోంది.

Also Read: Unmukt Chand Marriage: పెళ్లిపీటలెక్కిన ఉన్ముక్త్ చంద్.. ఈ క్రికెటర్‌ని ‘క్లీన్‌బౌల్డ్‌’ చేసిన ఆమె ఎవరంటే?

IND vs NZ: కివీస్‌పై సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్.. ఆసియాలోనే తొలి ఆటగాడిగా రికార్డులు కొల్లగొట్టిన హిట్‌మ్యాన్..!