- Telugu News Photo Gallery Cricket photos India Vs New Zealand: Team India Skipper Rohit Sharma win player of the series with 159 runs in 3 Match and many Records vs New Zealand
IND vs NZ: కివీస్‌పై సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్.. ఆసియాలోనే తొలి ఆటగాడిగా రికార్డులు కొల్లగొట్టిన హిట్‌మ్యాన్..!
రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఇప్పటి వరకు న్యూజిలాండ్‌తో 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 51.33 సగటు, 146.66 స్ట్రైక్ రేట్‌తో 308 పరుగులు.
Updated on: Nov 22, 2021 | 9:52 AM

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ అత్యధికంగా పరుగులు చేసిన ప్లేయర్‌గా అవతరించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో అతని సగటు 53, 154.37 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 159 పరుగులు సాధించాడు. ఈ 3 మ్యాచ్‌లలో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఇప్పటి వరకు న్యూజిలాండ్‌తో 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 51.33 సగటుతో 308 పరుగులు చేశాడు. అలాగే స్ట్రైక్ రేట్ 146.66 గా ఉంది. న్యూజిలాండ్‌లో జరిగిన 4 మ్యాచ్‌ల్లో రోహిత్ కెప్టెన్‌గా ఉండడం విశేషం.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 159 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌పై కెప్టెన్‌గా అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక 30 ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లో 150 సిక్సర్లు కూడా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్టుల్లో 50+ సిక్సర్లు, ODIల్లో 100+, T20Iల్లో 150+ సిక్సర్లు సాధించిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 450 ప్లస్ సిక్సర్లు బాదిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ఏదిగాడు. రోహిత్ 404 ఇన్నింగ్స్‌ల్లో 450 సిక్సర్లు బాదాడు.

టీ20ల్లో కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 50 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇది కాకుండా టీ20ఐలో 11 సార్లు 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగాను నిలిచాడు.




