- Telugu News Photo Gallery Cricket photos India vs New Zealand, 3rd T20I: Team india t20 Skipper rohit sharma becomes first asian batsmen to hit 150 sixes in t20i
IND vs NZ: హిట్‌మ్యాన్ @ 150 సిక్సర్లు.. ఆసియాలోనే నంబర్ వన్ ప్లేయర్‌గా రికార్డు..!
Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ తన 150 సిక్సర్లను పూర్తి చేశాడు. ఈ సమయంలో తన పేరిట ఒక ప్రత్యేక రికార్డును సృష్టించాడు.
Updated on: Nov 21, 2021 | 8:17 PM

కోల్‌కతా టీ20లో టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ అధ్బుతంగా ఆడి మరో అర్థసెంచరీ సాధించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో 3 సిక్సర్లు బాదిన వెంటనే రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

రోహిత్ శర్మ కంటే న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ 161 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 124 సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఎడమచేతి వాటం బౌలర్లపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. టీ20లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌పై రోహిత్ శర్మ 18 సిక్సర్లు కొట్టాడు. 17 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్న ఎవిన్ లూయిస్‌ను అధిగమించాడు.

కోల్‌కతా టీ20లోనే కెప్టెన్‌గా 50 టీ20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన ఘనత కూడా రోహిత్ శర్మ సాధించాడు. కెప్టెన్‌గా అత్యధిక 85 టీ20 సిక్సర్లు ఇయాన్ మోర్గాన్ పేరిట ఉన్నాయి. విరాట్ కోహ్లీ 59 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో 50కి పైగా సిక్సర్లు, వన్డేల్లో 100కి పైగా సిక్సర్లు, టీ20ల్లో 150కి పైగా సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ నిలిచాడు.




