IND vs NZ: ఈ ఫొటోలో రోహిత్ పక్కన ఉన్నది ఎవరో తెలుసా.. 15 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టీమిండియా బౌలర్?
Rohit Sharma-Rahul Dravid: టీమ్ ఇండియా రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్ ద్రవిడ్‌లు విజయంతో తమ కొత్త కెరీర్‌ను ప్రారంభించారు.
India vs New Zealand: నవంబర్ 17, బుధవారం జైపూర్‌లో స్వదేశీ ప్రేక్షకుల మధ్య భారత పేసర్ దీపక్ చాహర్.. తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఆడిన 11 మంది సభ్యుల జట్టులో చాహర్ భాగమైన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది మొదటి అసైన్‌మెంట్. అలాగే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కి కూడా న్యూజిలాండ్ సిరీస్ చాలా కీలకమైనది. ఇద్దరూ తన కొత్త కెరీర్‌లను విజయాలతో ప్రారంభించారు. ఈడెన్ గార్డెన్‌లో జరిగిన చివరి టీ20 తరువాత 3-0తో సిరీస్‌ను రోహిత్ సేన చేజిక్కించుకుంది. తొలి టీ20 మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్ ఓ త్రోబాక్ ఫోటోను పంచుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అప్పటి నుంచి తెగ సందడి చేస్తోంది. దీపక్ చాహర్ 15ఏళ్ల నాటి ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఆ ఫొటోలో హిట్‌మ్యాన్ కూడా ఉన్నాడు. మరో పక్కన ప్రస్తుతం వీరిద్దరు ఉన్న ఫొటోను ఉంచాడు.
“దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఒకే మైదానంలో మేమిద్దరం. నాకు, రోహిత్ భయ్యాకు ఆ సమయంలో మా ఇద్దరికీ గడ్డం లేదు” అని చాహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ ఇచ్చారు. కొన్ని గంటల క్రితం చాహర్ షేర్ చేసిన పోస్ట్‌కి 5,56,873 లైక్‌లు వచ్చాయి. దీనికి టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్ కూడా కామెంట్స్ అందించారు. “బ్యాక్ ఇన్ మెమరీ లేన్” అని ముంబై ఇండియన్స్ రాసుకొచ్చింది.
View this post on Instagram
IPL 2022: స్టార్, సోనీలకు చెక్ పెట్టనున్న జియో.. ఐపీఎల్ ప్రసారాల కోసం బరిలోకి..!