Ish Sodhi: ఇష్ సోధి స్టన్నింగ్ క్యాచ్.. వైరల్ అయిన వీడియో..
ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇష్ సోధి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది...
ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇష్ సోధి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ధాటిగా ఆడుతున్నారు. వారిని ఔట్ చేయడానికి కివీస్ కెప్టెన్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా స్పిన్నర్ ఇష్ సోధి 12 ఓవర్ వేసేందుకు సిద్ధమయ్యాడు. సోధి వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ రెండో బంతిని రోహిత్ శర్మ స్ట్రైయిట్‌గా బౌలర్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో సోధి సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు.
Sodhi with glue on his hands! What a grab ?#INDvNZ pic.twitter.com/1EHanqppYI
— The Cricket Podcast (@TheCricketPod) November 21, 2021
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(56 పరుగులు, 31 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సులు), ఇషాన్ కిషన్(29 పరుగులు, 21 బంతులు, 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వికెట్లు వెంటవెంటనే పడడంతో మిడిలార్డర్‌లో భారత్ చాలా ఇబ్బంది పడింది. సూర్యకుమార్ యాదవ్ 0, రిషబ్ పంత్ 4 త్వరగా ఔటయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(25 పరుగులు, 20 బంతులు, 2 ఫోర్లు), వెంకటేష్ అయ్యర్(20 పరుగులు, 15 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) మరో కీలక భాగస్వామ్యాన్ని అందించారు.
వీరిద్దరు పెవిలియన్ చేరిన తరువాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 1, హర్షల్ పటేల్ 18 మూడో కీలక భాగస్వామ్యాన్ని టీమిండియాకు అందించారు. చివర్లో దీపక్ చాహర్(21 పరుగులు, 8 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) కివీస్ బౌలర్లపై ప్రతాపంచూపించాడు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్, ఇష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. 184 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఏ దశలోనూ ఛేదించేలా అనిపించలేదు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ టీం కేవలం 17.2 ఓవర్లకు 111పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రోహిత్ సేన 73 పరుగులతో ఘన విజయం సొంతం చేసుకుంది.
What a catch on his own bowling!#Sodhi took #RohitSharma single handedly! Well played @ImRo45 ????#NZvIND #NZvsIND #INDvNZ #INDvsNZ #Cricket pic.twitter.com/5LZXDWZEn5
— BlueCap ?? (@IndianzCricket) November 21, 2021