Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. కరోనా నేపథ్యంలో ఒత్తిడి తగ్గించేందుకు కీలక నిర్ణయం..

TS Inter Exams: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. పాఠశాలలు మూతపడడంతో ఏకంగా రెండు అకడమిక్‌ ఇయర్‌లపై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం..

TS Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. కరోనా నేపథ్యంలో ఒత్తిడి తగ్గించేందుకు కీలక నిర్ణయం..
Inter Exams Ts
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 22, 2021 | 6:43 PM

TS Inter Exams: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. పాఠశాలలు మూతపడడంతో ఏకంగా రెండు అకడమిక్‌ ఇయర్‌లపై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరిగి విద్యా సంస్థలు తెరుచుకున్న కరోనా తాలుకూ ప్రభావం ఇంకా విద్యార్థులపై కొనసాగుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ ప్రకటించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌తో పాటు సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు కూడా 70 శాతం సిలబస్‌ను మాత్రమే బోధించనున్నారు.

కరోనా నేపథ్యంలో తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 70 శాతం సిలబస్‌తోనే విద్యా సంవత్సరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక 70 శాతం సిలబస్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇంటర్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గతేడాది కూడా విద్యా సంవత్సరాన్ని 70 శాతం సిలబస్‌తోనే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఇదే విధానాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.

మరోసారి ప్రవేశాల గడువు పొడగింపు..

ఇక ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరో సారి పొడగించింది. ఇప్పటికే పలు సార్లు చివరి తేదీని పొడగించిన ఇంటర్మీడియట్‌ బోర్డు మరోసారి ప్రవేశాల గడువును పెంచారు. కరోనా నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Delhi Pollution: హస్తినలో కాలుష్యానికి కారణం ఎవరూ? పొల్యూషన్‌కి సొల్యూషన్‌ ఉందా? ‘నాసా’ చెప్పిన అసలు నిజం!

AIISH Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

Maggi with Fanta: ఇదేమి వంటరా నాయనా.. ఫాంటా డ్రింక్ మిక్స్‌తో మ్యాగ్గీ డిష్.. వైరల్ వీడియో