AIISH Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..

AIISH Recruitment 2021: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో (ఏఐఐఎస్‌హెచ్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మైసూర్‌లో ఉన్న ఈ సంస్థలో ఖాళీలను...

AIISH Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..
Aiish Recruitment
Follow us

|

Updated on: Nov 22, 2021 | 5:27 PM

AIISH Recruitment 2021: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌లో (ఏఐఐఎస్‌హెచ్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మైసూర్‌లో ఉన్న ఈ సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రీసెర్చ్‌ ఆఫీసర్/ జేఆర్‌ఎఫ్‌ల పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ ఆడియాలజీ, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలతోపాటు పని అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30, 35 ఏళ్లకు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ/ ఇంటరాక్షన్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు రూ. 31,000 నుంచి రూ. 40,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ 29-11-2021తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Laptops Under 30K: కొత్త ల్యాప్‌టాప్‌ కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.? రూ. 30 వేల లోపు ఉన్న వాటిపై ఓ లుక్కేయండి..

Kamal Haasan: కరోనా బారిన పడ్డ కమల్‌ హాసన్‌.. అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్‌..

రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?