Delhi Pollution: హస్తినలో కాలుష్యానికి కారణం ఎవరూ? పొల్యూషన్‌కి సొల్యూషన్‌ ఉందా? ‘నాసా’ చెప్పిన అసలు నిజం!

దేశ పరిపాలన కేంద్రంగా ఉన్న ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. లక్షలాది వాహనాలు, పరిశ్రమల వల్లే ఉత్పన్నమయ్యే ప్రమాదకరమైన విషవాయువుల బారిన జనం పడుతుంటే ఏం చేస్తున్నారని సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది.

Delhi Pollution: హస్తినలో కాలుష్యానికి కారణం ఎవరూ? పొల్యూషన్‌కి సొల్యూషన్‌ ఉందా? ‘నాసా’ చెప్పిన అసలు నిజం!
Delhi Pollution
Follow us

|

Updated on: Nov 22, 2021 | 5:16 PM

Delhi Pollution: దేశ పరిపాలన కేంద్రంగా ఉన్న ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. లక్షలాది వాహనాలు, పరిశ్రమల వల్లే ఉత్పన్నమయ్యే ప్రమాదకరమైన విషవాయువుల బారిన జనం పడుతుంటే ఏం చేస్తున్నారని సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడంపై సీరియస్ అయింది. అంతే కాదు….ఢిల్లీలో సాధారణ ప్రజలు విషవాయువులు పీలుస్తుంటే.. ఫైవ్ స్టార్‌ హోటళ్లలో ఉండేవాళ్లు రైతులపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. కాలుష్యానికి కారణం రైతులను చూపిస్తున్నారని , కాని దీపావళి 10 రోజుల తరవాత కూడా ఢిల్లీలో టపాసులు ఎలా పేలుతున్నాయిని సీజేఐ రమణ ప్రశ్నిచారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఢిల్లీలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్నారు. పొల్యూషన్‌కి సొల్యూషన్‌ వెదకకుండా … కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోవాలని ఆదేశించింది.

పొల్యూషన్‌ వల్ల తలెత్తే సమస్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరణ ఇచ్చారు. అయినా సంతృప్తి చెందని సుప్రీంకోర్టు.. అధికారులకు అన్ని కార్లు అవసరం లేదని , ఉన్నతాధికారులు ప్రభుత్వ రవాణాను ఉపయోగిస్తే మంచిదంటూ సూచన చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 100 శాతం సిబ్బంది ఈ పరిస్థితుల్లో పనిచేయడం అవసరమా ? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 50 శాతం ఉద్యోగులతో పనిచేయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది. నవంబర్‌ 21 వరకు వాతావరణ మార్పుల కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గే అవకాశముందని సొలిసిటన్‌ జనరల్‌ చెప్పడంపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటివరకు కోర్టు ప్రేక్షకపాత్ర పోషిస్తూ కూర్చొదని స్పష్టం చేసింది.

ఇదిలావుంటే, ఇక్కడ వాయు కాలుష్యానికి.. పంజాబ్, హర్యానా సహా పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న పొగ కూడా కారణమేనని.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా అంచనా వేసింది. నగరంలో పరిశ్రమలు, వాహన కాలుష్యానికి ఈ పొగతోడైనట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఈ కాలుష్యం కారణంగా నగర ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కాలుష్యం భారీస్థాయిలో నమోదవుతోందని నాసా వెల్లడించింది. ఢిల్లీ వాయు కాలుష్యానికి పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ, పొరుగు రాష్ట్రాల రైతులు కాల్చే పంట వ్యర్థాలు, బాణసంచా కాల్చడం లాంటివి కారణమని తెలిపింది.

విజిబుల్‌ ‘ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ రేడియో మీటర్‌ సూట్‌’ ద్వారా.. ఈ నెల 11 నాటి పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామీ ఎంపీపీ శాటిలైట్‌ ద్వారా ఫొటోలు తీసింది. పంజాబ్‌, హర్యానాలో పంట వ్యర్థాలను కాల్చడంతో భారీగా పొగ ఢిల్లీవైపు మళ్లి.. మరింత కాలుష్యం ఏర్పడటానికి కారణమవుతోందని నాసా పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యానికి పాకిస్థాన్‌ సైతం కారణమని నాసా గుర్తించింది. ఉత్తర పాకిస్థాన్‌లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల బారీగా వెలువడుతున్న పొగ కూడా ఈ కాలుష్యం పెరుగుదలకు కారణమని తెలిపింది.ఈ కాలుష్యంతో మనుషుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు వెల్లడించింది. పొగ కారణంగా ఈ నెల 11న దాదాపు 2.2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నాసా మార్షల్‌ స్సేస్ ఫ్లైట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త పవన్‌ గుప్తా పేర్కొన్నారు. ఈ నెల 12న దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. థార్‌ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన దుమ్ము, ధూళి, వాహన, నిర్మాణ, టపాసుల కాలుష్యం సైతం తీవ్రతకు కారణమైనట్టు వెల్లడించారు.

ఢిల్లీలోని సెన్సార్లు ఈ నెలలో చాలా సందర్భాల్లో క్యూబిక్‌ మీటరుకు 400 మైక్రో గ్రాములకు మించి పీఎం 2.5, పీఎం 10 స్థాయులు నమోదు చేశాయని నాసా తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిపారసు చేసిన క్యూబిక్‌ మీటరుకు 15 మైక్రో గ్రాముల కంటే ఎక్కువ అని వివరించింది.

Read Also… AP 3 Capitals: ఏపీ మూడు రాజదానుల బిల్లు ఉపసంహరణ నిర్ణయంపై ఎవరెవరు ఏమన్నారంటే..?

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్