ఇల్లు కొనడానికి బంపర్ ఆఫర్.. ఈ-వేలంలో పాల్గొనండి.. తక్కువ ధరకే కొనుగోలు చేయండి..
Bank of India: మీరు తక్కువ ధరలో ఇల్లు కొనాలని చూస్తున్నారా.. అయితే ఇది మీకు శుభవార్తే. ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 25న తన రుణ ఎగవేతదారుల
Bank of India: మీరు తక్కువ ధరలో ఇల్లు కొనాలని చూస్తున్నారా.. అయితే ఇది మీకు శుభవార్తే. ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 25న తన రుణ ఎగవేతదారుల ఆస్తుల మెగా ఈ-వేలం నిర్వహిస్తుంది. వీటిలో రెసిడెన్షియల్ ఫ్లాట్లు, కార్యాలయ స్థలం, వాణిజ్య దుకాణాలు మొదలైనవి ఉన్నాయి. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా 1,000 ఓపెన్ ప్లాట్లు, నివాస, వాణిజ్య, పారిశ్రామిక ఆస్తుల ఈ-వేలం నిర్వహించింది. రుణాలు తిరిగి చెల్లించని రుణగ్రహీతల ఆస్తులు ఇవి. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వీట్ ద్వారా తెలియజేసింది.
SBI ఈ-వేలానికి ఒక వారం ముందు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఆస్తులను వేలం వేసింది. బ్యాంకులు డిఫాల్టర్ ఆస్తిని జప్తు చేసి వేలానికి పెట్టడం ద్వారా SARFAESI చట్టం, 2002 ప్రకారం తమ బకాయిలను తిరిగి పొందుతున్నాయి. అటువంటి ఆస్తి వేలంలో పాల్గొనే ముందు దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు అంచనా వేయాలి. ఆస్తుల వేలంలో మంచి డీల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చేయాలో చూద్దాం.
300కు పైగా ఆస్తుల వేలం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ట్వీట్‌లో “అపూర్వమైన ధరలకు గొప్ప ఆస్తులను కొనుగోలు చేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నవంబర్ 25, 2021న బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై మరిన్ని ప్రధాన నగరాల్లో జరగనున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ప్రాపర్టీ వేలంలో పాల్గొనండి” ఇందులో 300కు పైగా ఆస్తులను వేలం వేస్తున్నారు.
ఇలా ఈ-వేలంలో పాల్గొనండి ఈ-వేలం నోటీసులో ఇచ్చిన సంబంధిత ఆస్తికి EMD డిపాజిట్ చేయాలి. ‘KYC డాక్యుమెంట్లు’ సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌లో చూపించాలి. వేలంలో పాల్గొనే వ్యక్తి తప్పనిసరిగా డిజిటల్ సంతకం కలిగి ఉండాలి. కాకపోతే దీని కోసం ఈ-వేలం నిర్వాహకుడిని లేదా మరేదైనా అధీకృత ఏజెన్సీని సంప్రదించవచ్చు. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌లో EMDని జమ చేసి, KYC పత్రాలను చూపించిన తర్వాత ఈ-వేలం నిర్వాహకుడు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ను బిడ్డర్ ఈమెయిల్ ఐడికి పంపుతారు. వేలం నియమాల ప్రకారం.. ఈ-వేలం రోజున సమయానికి లాగిన్ చేయడం ద్వారా బిడ్డింగ్ చేయవచ్చు.