DLRL Recruitment: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కు చెందిన ఈ సంస్థ మొత్తం 101 ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది...
హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ పలు విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కు చెందిన ఈ సంస్థ మొత్తం 101 ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 101 ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సీవోపీఏ, ఎలక్ట్రానిక్ మెకానికల్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, షీట్ మెటల్, వెల్డర్; ఎలక్ట్రోప్లేటింగ్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), సెక్రటేరియల్ ట్రైనింగ్ అండ్ మేనేజ్‌మెంట్, డీజిల్ మెకానిక్, ఫైర్ మ్యాన్, కంప్యూటర్ హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్, బుక్ బైండింగ్, ఏఎన్ఎం విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ, డిప్లొమా, ఏఎన్ఎం పూర్తి చేసి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7,700 నుంచి రూ. 8050 వరకు స్టైపెండ్‌గా చెల్లిస్తారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Minister KTR: బీజేపీ మత రాజకీయాలు ఇక్కడ చెల్లవు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు