Exim Bank Recruitment: ఎగ్జిమ్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ముగుస్తోన్న గడువు.. పూర్తి వివరాలు..

ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబైలోని ఈ బ్యాంక్‌ ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్‌ను షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు/ ఇతర వెనుకబడిన తరగతుల కోసం విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టులను భర్తీ..

Exim Bank Recruitment: ఎగ్జిమ్‌ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ముగుస్తోన్న గడువు.. పూర్తి వివరాలు..
Exim Bank Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 01, 2022 | 1:02 PM

ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబైలోని ఈ బ్యాంక్‌ ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్‌ను షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు/ ఇతర వెనుకబడిన తరగతుల కోసం విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో మేనేజర్(లా) (02), మేనేజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) (02), మేనేజ్‌మెంట్ ట్రైనీ(కార్పొరేట్ లోన్‌లు & అడ్వాన్స్‌లు/ ప్రాజెక్ట్ ఫైనాన్స్/ క్రెడిట్ లైన్స్/ ఇంటర్నల్ క్రెడిట్ ఆడిట్/ రిస్క్ మేనేజ్‌మెంట్/ కంప్లయన్స్/ ట్రెజరీ అండ్ అకౌంట్స్/ రికవరీ తదితరాలు) (41) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులకు అనుగుణంగా బ్యాచిలర్స్ డిగ్రీ(లా), బీఈ, బీటెక్‌, ఎంబీఏ, పీజీడీబీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైణ్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 04-11-2022తో గడువు ముగియనుంది.

* ఆన్‌లైన్‌ పరీక్షను నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలను జనవరి – ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..