AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs 2025: ఏప్రిల్ నెలలో ముగుస్తున్న ప్రభుత్వ కొలువుల దరఖాస్తులు.. ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేశారా?

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎగ్జాం సీజన్‌ నడుస్తుంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు నడుస్తున్నాయి. ఆర్మీ, నేవీ నుంచి పోలీస్, హెల్త్‌, విద్య రంగాల వరకు అనేక హై-ప్రొఫైల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీరు కెరీర్‌లో స్థిరపడాలనుకుంటే ఇదే మంచి..

Govt Jobs 2025: ఏప్రిల్ నెలలో ముగుస్తున్న ప్రభుత్వ కొలువుల దరఖాస్తులు.. ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేశారా?
Govt Jobs
Srilakshmi C
|

Updated on: Apr 08, 2025 | 4:46 PM

Share

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎగ్జాం సీజన్‌ నడుస్తుంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు నడుస్తున్నాయి. ఆర్మీ, నేవీ నుంచి పోలీస్, హెల్త్‌, విద్య రంగాల వరకు అనేక హై-ప్రొఫైల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీరు కెరీర్‌లో స్థిరపడాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఏప్రిల్ 2025కి సంబంధించి టాప్ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలు, వాటి గడువు తేదీలు పొందుపరిచాం. ఆసక్తి, అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ రిక్రూట్‌మెంట్ 2025

భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ రిక్రూట్‌మెంట్ 2025 సదావకాశం కల్పిస్తుంది. అగ్నివీర్ నియామక ర్యాలీలో పాల్గొనే యువతకు సైన్యంలో చేరేందుకు మార్గం సుగమం చేస్తుంది. బీహార్, యూపీ, రాజస్థాన్, ఎంపీ, ఏపీ, తెలంగాణ, హర్యానా, ఛత్తీస్‌గఢ్ మరియు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ర్యాలీలో పాల్గొనడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 10, 2025 లోపు ముగుస్తుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ 2025-26

భారత నావికాదళం 2025 – 2026 బ్యాచ్‌లకు అగ్నివీర్ SSR, MR పోస్టులకు నియామకాలను ప్రకటించింది. పురుష, మహిళా అభ్యర్థులు ఇరువురూ ఈ పోస్టులకు అర్హులు. ఈ పోస్టులకు INET ప్రవేశ పరీక్ష మే 2025లో జరుగుతుంది. నేవీలో దేశానికి సేవ చేయడానికి ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భారత నౌకాదళంలో అగ్నివీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో ప్రారంభమయ్యే 2025, 2026 బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు ఏప్రిల్‌ 10, 2025తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. మెట్రిక్యూలేషన్‌ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నేషనల్ ఏరోస్పేస్‌ లాబోరాటరీస్‌లో ప్రాజెక్టు స్టాఫ్‌ పోస్టులు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌- నేషనల్ ఏరోస్పేస్‌ లాబారాటరీస్‌ (NAL) ప్రాజెక్టు స్టాఫ్‌ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి 9 వరకు అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

అడ్రస్: సీఎస్‌ఐఆర్‌-నాల్ (రాబ్‌ మీటింగ్ కాంప్లెక్స్, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్), ఎస్‌బీఐ పక్కన, నాల్‌ బ్రాంచ్, కోడిహల్లి, బెంగళూరు – 560017.

ఢిల్లీ జల్‌బోర్డ్‌లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని ఢిల్లీ జల్‌ బోర్డ్‌ 131 జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గేట్‌ స్కోర్‌ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు djbdirector@gmail.com లేదా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్‌, రూం నెం.202, దిల్లీ జల్‌ బోర్డ్‌, వరుణాలయ ఫెజ్‌2, కరోల్‌ భాగ్‌, న్యూఢిల్లీ.. ఈ మెయిల్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.