TG ECET 2025 Notification: డిప్లొమా అర్హతతో బీటెక్ 2nd ఇయర్‌లో ప్రవేశాలకు.. తెలంగాణ ఈసెట్ నోటిఫికేషన్
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు అలర్ట్.. 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించే.. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈసెట్) 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది..

హైదరాబాద్, ఏప్రిల్ 8: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈసెట్) 2025 నోటిఫికేషన్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీజిసీహెచ్‌ఈ) తాజాగా విడుదల చేసింది. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు తప్పనిసరిగా పాలిటెక్నిక్ డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.900, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్లులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజి ఈసెట్) 2025 మే 12వ తేదీన నిర్వహిస్తారు.
పాలిటెక్నిక్‌లు, జూనియర్, డిగ్రీ రాత పరీక్షల తేదీల వెల్లడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు, జూనియర్, డిగ్రీ, తితిదే డిగ్రీ కళాశాలల అధ్యాపకుల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. జూన్ 16, 17, 18, 19, 23, 24, 25, 26 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌లలో పేర్కొన్నట్లుగా ఉమ్మడి సిలబస్ ఆధారంగా ఈ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.