AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Jobs After 12th: మీరూ ఇంటర్‌ పాసైయ్యారా? అయితే వెంటనే ఈ ప్రభుత్వ కొలువులు దక్కించుకోండి..

చాలా మంది ఆర్ధికంగా అంత బలంగా లేని యువత ఇంటర్ పూర్తైన వెంటనే ఉపాధి అవకాశాలు పొందాలని భావిస్తుంటారు. దీంతో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మంచి జీతంతోపాటు సమాజంలో గౌరవాన్ని అందిస్తాయి. ఇలాంటి వారి కోసం పూర్తి సమాచారం ఈ కింద చెక్ చేయండి..

Govt Jobs After 12th: మీరూ ఇంటర్‌ పాసైయ్యారా? అయితే వెంటనే ఈ ప్రభుత్వ కొలువులు దక్కించుకోండి..
Govt Jobs After 12th
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 08, 2025 | 5:35 PM

నేటి యువత పదో తరగతి, ఇంటర్‌ తర్వాత ఉపాధి అవకాశాలు పొందాలని భావిస్తున్నారు. దీంతో ఉత్తీర్ణత సాధించిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మంచి జీతంతోపాటు సమాజంలో గౌరవాన్ని అందిస్తాయి. అందుకే యువత ప్రభుత్వ ఉద్యోగాలను ఇష్టపడుతున్నారు. మీరు కూడా పాసై ఉంటే.. వెంటనే ఉద్యోగం పొందాలని భావిస్తే.. ఏయే కొలువులు పొందొచ్చో.. అలాంటి ప్రభుత్వ విభాగాల ఉద్యోగ వివరాలను ఈ కింద పొందుపరిచాం. ముందు నుంచే మంచి ప్లానింగ్‌తో వాటికి సిద్ధం కావడం ద్వారా చిన్న వయసులోనే ప్రభుత్వ కొలువు దక్కించుకోవచ్చు.

రైల్వే ఉద్యోగాలు

ఇండియన్‌ రైల్వే.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపడుతున్న సంస్థ. ప్రతి యేట లక్షలాది పోస్టులకు నియామకాలు చేపడుతుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి, NTPC, క్లర్క్ వంటి పోస్టులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌లను విడుదల చేస్తుంది. ఈ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. అభ్యర్థులను రాత పరీక్ష, శారీరక పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. రైల్వే ఉద్యోగాలు మంచి జీతం, మంచి ప్రమోషన్ అవకాశాలను సైతం అందిస్తాయి.

పోస్టల్ డిపార్ట్‌మెంట్ (ఇండియా పోస్ట్)

12వ తరగతి పాసైన యువతకు ఉద్యోగాలు కల్పించే మరో అతి పెద్ద విభాగం పోస్టల్ శాఖ. ఇందులో గ్రామీణ డాక్ సేవక్ (GDS), పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్ వంటి పోస్టులకు ప్రతి యేట నియామకాలు జరుగుతాయి. చాలా పోస్టులకు ఎంపిక కేవలం మెరిట్ ఆధారంగా జరుగుతుంది. అంటే 12వ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. అయితే కొన్ని పోస్టులకు రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఈ విభాగంలో పనిచేయడం వల్ల స్థిరత్వంతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

ఇవి కూడా చదవండి

రక్షణ దళాలు

భారత సైన్యం, CRPF, BSF, CISF, ITBP వంటి దేశ భద్రతా దళాలలో 12వ తరగతి ఉత్తీర్ణులైన యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ సోల్జర్ జిడి, క్లర్క్, టెక్నికల్ ట్రేడ్స్ పోస్టులకు నియామకాలు జరుపుతుంది. ఇందు కోసం శారీరక పరీక్ష, వైద్య పరీక్ష, సాధారణ రాత పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా CRPF, BSF, CISF, ITBP మొదలైన పారామిలిటరీ దళాలలో కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు నియామకాలు జరుగుతాయి. వీటికి 12వ తరగతి ఉత్తీర్ణత అవసరం. శారీరకంగా చురుకైన యువతకు ఈ ఉద్యోగాలు మంచి ఎంపిక.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC ఉద్యోగాలు) లో నియామకాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అనేది వివిధ ప్రభుత్వ విభాగాలలో నియామకాలను నిర్వహించే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ప్రధాన సంస్థ. 12వ తరగతి ఉత్తీర్ణులైన యువతకు SSC CHSL (కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్) పరీక్ష అత్యంత అనుకూలమైనది. దీని ద్వారా LDC (లోయర్ డివిజన్ క్లర్క్), DEO (డేటా ఎంట్రీ ఆపరేటర్), పోస్టల్ అసిస్టెంట్ వంటి పోస్టులకు నియామకాలు జరుగుతాయి. రాత పరీక్షలో ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్టులను అడుగుతారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారితమైనది.

బ్యాంకింగ్ రంగం

బ్యాంకింగ్ రంగంలో 12వ తరగతి ఉత్తీర్ణులైన యువత కోసం, ముఖ్యంగా సహకార బ్యాంకులలో ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. కొన్ని రాష్ట్రాల్లో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్థానిక స్థాయిలో క్లర్క్ లేదా అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చాలా ప్రభుత్వ బ్యాంకులలో (SBI, IBPS వంటి) నియామకాలకు గ్రాడ్యుయేషన్ అవసరం. వీటితోపాటు పోలీస్ కానిస్టేబుల్, ఇండియన్ ఆర్మీలో కూడా ఇంటర్ తర్వాత ఉద్యోగాలు పొందే ఛాన్స్ అందిస్తున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..