AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Appraisal Course: యువతకు గుడ్‌న్యూస్‌.. బంగారు అభరణాలను వెలకట్టడంపై కోర్సులు

నిరుద్యోగుల కోసం వివిధ రంగాలలో కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. వివిధ రకాల కోర్సులు చేయడం వల్ల ఉద్యోగం సంపాదించేందుకు..

Gold Appraisal Course: యువతకు గుడ్‌న్యూస్‌.. బంగారు అభరణాలను వెలకట్టడంపై కోర్సులు
Gold Appraiser Course Image Credit source: TV9 Telugu
Subhash Goud
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 14, 2022 | 3:59 PM

Share

నిరుద్యోగుల కోసం వివిధ రంగాలలో కోర్సులు అందుబాటులో ఉంటున్నాయి. వివిధ రకాల కోర్సులు చేయడం వల్ల ఉద్యోగం సంపాదించేందుకు ఆస్కారం ఉంటుంది. ముందస్తు కోర్సులు చేయడం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇక బంగారు అభరణాలపై కోర్సులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించేందుకు వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. బంగారు అభరణాల వెలకట్టడం ఎలా అనే కోర్సులను చేస్తే జ్యూలరీ షాపుల్లో అవకాశాలు లభిస్తాయి.

కోర్సు కంటెంట్‌: ప్రాథమిక మెటలర్జీ, టంకము, బంగారు స్వచ్ఛత, జ్యువెలరి, నకిలీ అభరణాల గుర్తింపు, నికర బరువు లెక్కించడం వంటివి ఉంటాయి.

కోర్సుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు: అయితే ఈ కోర్సుల్లో జాయిన్‌ అయి నేర్చుకోవడం వల్ల అభరణాల అవుట్లెట్‌ ప్రారంభించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. బంగారాన్ని కుదువ పెట్టుకోవడం వంటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకులు, ఆర్థిక బంగారు విలువ నిర్ధారకుడు ఉద్యోగం పొందడానికి సంస్థలు, నాణ్యత అభరణల కొనుగోలుకు సహాయపడుతుంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆ కోర్సులు ఇచ్చేందుకు సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు ఇచ్చే ఈ కోర్సుల్లో ఆసక్తిగల వారు చేరవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్‌ను అందజేస్తారు. ఈ కోర్స్ చేస్తే బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ ఇచ్చేటప్పుడు నాణ్యత చూసి విలువ కట్టే అప్రయిజర్ గా పని దొరుకుతుంది. ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ చెన్నై వారి ఆధ్వర్యంలో ఈ కోర్సు అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కోర్సు ఫీజు, సమయ వివరాలు

కోర్సు నేర్చుకునేందుకు ఎంత ఫీజు: రూ.15,000 తేదీ: నవంబర్‌ 23 నుంచి 26వ తేదీ వరకు సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు. అర్హత: కనీసం 8వ తరగతి. మరిన్ని వివరాలకు రూ.9652611011, 9652611022 నంబర్లకు సంప్రదించవచ్చు.

Course 1

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి