Subsidy on Drone: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. డ్రోన్లపై భారీ సబ్సిడీ.. ఎంతంటే..!

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన పథకాలను అమలు చేస్తోంది. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది..

Subsidy on Drone: రైతులకు మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. డ్రోన్లపై భారీ సబ్సిడీ.. ఎంతంటే..!
Drones
Follow us

|

Updated on: Nov 14, 2022 | 8:03 AM

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన పథకాలను అమలు చేస్తోంది. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది కేంద్రం. రైతులు అనేక విధాలుగా సబ్సిడీ ప్రయోజనాలను పొందుతున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది. సబ్సిడీపై డ్రోన్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

డ్రోన్‌లను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కూడా పొందవచ్చు. వ్యవసాయంలో డ్రోన్లను ఉపయోగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. దీని కోసం రైతులను ప్రోత్సహించేందుకు దాని కొనుగోలుపై సబ్సిడీ ఇచ్చే పథకాన్ని సిద్ధం చేశారు. డ్రోన్‌కు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ, గరిష్టంగా రూ. 5 లక్షల వరకు రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతోంది.

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం:

డ్రోన్ల సహాయంతో రైతులు తక్కువ సమయంలో పొలంలో నిలబడి పంటలపై సులభంగా ఎరువులు, ఇతర పురుగు మందులను పిచికారీ చేయవచ్చు. దీంతో రైతులకు చాలా సమయం ఆదా అవుతుంది. దీనితో పాటు పురుగుమందులు, మందులు, ఎరువులు కూడా ఆదా అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ రైతులకు సబ్సిడీ:

వ్యవసాయ ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పథకాలను అమలు చేసింది. దీంతో రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు. డ్రోన్ల కొనుగోలుపై రైతులకు సబ్సిడీ ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతులకు డ్రోన్‌ల ధరలో 50 శాతం చొప్పున గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇతర రైతులకు డ్రోన్‌ల కొనుగోలుకు 40 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నారు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి