PM Kisan: రైతులకు అలర్ట్‌.. 13వ విడత పీఎం కిసాన్‌ డబ్బులు రావాలంటే ఈ పని తప్పనిసరి చేయాల్సిందే.?

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి ..

PM Kisan: రైతులకు అలర్ట్‌.. 13వ విడత పీఎం కిసాన్‌ డబ్బులు రావాలంటే ఈ పని తప్పనిసరి చేయాల్సిందే.?
ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేయవలసి ఉంటుంది. మీరు ఇంకా ల్యాండ్ వెరిఫికేషన్ చేయకపోతే, దీని కోసం సమీపంలోని వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి.
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2022 | 12:48 PM

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ఇక రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలలో కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత పొందడానికి ఈ-కేవైసీ ప్రక్రియ తప్పనిసరి. కేవైసీ లేకపోతే 13వ విడత డబ్బులు అందవు. ఇందుకోసం రేషన్ కార్డు కాపీని సమర్పించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆధార్‌ను కూడా సమర్పించాలి.

పీఎం కిసాన్ యోజన తదుపరి విడత పొందడానికి రేషన్ కార్డ్ సాఫ్ట్ కాపీ కాకుండా పీడీఎఫ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం రేషన్ కార్డ్ కాపీని సమర్పించాలి. రేషన్ కార్డు హార్డ్ కాపీకి బదులు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేయాలి. రేషన్‌కార్డు సాఫ్ట్‌ కాపీ పీడీఎఫ్‌ మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని, మునుపటిలా సాఫ్ట్‌ కాపీ ఫోటోస్టాట్‌ ఇవ్వడం వల్ల పనిచేయదు.

రేషన్ కార్డ్ కాపీని అప్‌లోడ్ చేయాలంటే మీరు పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించాలి. ఇక్కడ మీరు పీడీఎఫ్‌ ఫైల్ తయారు చేయడం ద్వారా రేషన్ కార్డ్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయవచ్చు. మీరు రేషన్ కార్డు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్‌ను సమర్పించకపోతే మీరు పథకం ప్రయోజనాన్ని పొందలేరు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి కిసాన్ యోజన నిబంధనల ప్రకారం.. ప్రతి లబ్ధిదారుడు తన భూమికి సంబంధించిన పత్రాలను ముందుగా ధృవీకరించడం తప్పనిసరి. భవిష్యత్తులో సాధ్యమయ్యే రిగ్గింగ్‌లను నిరోధించడానికి ఇది జరుగుతోంది. అందుకే లబ్ధిదారులు తప్పనిసరిగా భూ రికార్డులను సరిచూసుకోవాలి. ఇది చేయకపోతే వారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు తీసుకోలేరు.

కాగా, ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున మూడు సమాన విడతలుగా రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున 12 విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. అక్టోబర్ 2022లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12వ విడత మొత్తాన్ని రైతుల ఖాతాకు బదిలీ చేశారు. 13వ విడత రావాలంటే ఈకేవైసీ చేయని వారు వెంటనే ఈ పనిని పూర్తి చేసుకోవడం మంచిది.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?