Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ఒకేసారి పెట్టుబడితో నెలకు రూ.2,500
ప్రస్తుతం బ్యాంకుల లాగే పోస్టాఫీసుల్లోనూ రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు..
ప్రస్తుతం బ్యాంకుల లాగే పోస్టాఫీసుల్లోనూ రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు.. ఇప్పుడు ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖను మరింతగా మెరుగుపర్చింది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఇక పోస్టాఫీసుల్లో ఉత్తమమైన స్కీమ్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. ఇందులో ఒక్కసారి డబ్బును ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నెలనెలా వడ్డీ రూపంలో డబ్బును పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్కీమ్ పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరుతో కూడా తెరవవచ్చు. మీరు మీ పిల్లల పేరుతో ఈ ప్రత్యేక ఖాతాను (పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్) ఓపెన్ చేస్తే మంచి రాబడి పొందవచ్చు.
ఖాతాను ఓపెన్ చేయడం ఎలా..?
మీరు ఏదైనా పోస్టాఫీసులో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ను ఓపెన్ చేయవచ్చు. దీని కింద కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.4.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద వడ్డీ రేటు 2021 ప్రకారం 6.6 శాతం ఉంటుంది. పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, మీరు అతని పేరు మీద ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు, ఆ తర్వాత దానిని మూసివేయవచ్చు.
రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే..
మీ పిల్లల వయస్సు 10 సంవత్సరాలు ఉంటే అతని పేరు మీద రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, ప్రతి నెలా మీ వడ్డీ ప్రస్తుత 6.6 శాతం ప్రకారం రూ. 1100 అవుతుంది. ఐదేళ్లలో ఈ వడ్డీ మొత్తం 66 వేల రూపాయలు అవుతుంది. చివరిగా మీరు 2 లక్షల రూపాయల రిటర్న్ కూడా పొందుతారు. ఈ విధంగా, మీరు ఈ స్కీమ్‌పై రూ.1100 వరకు పొందవచ్చు.
రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే..
అలాగే రూ.4.5 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా దాదాపు రూ.2500 వస్తుంది. ఇలా పోస్టాఫీసులో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల మంచి రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి ఏవైనా సందేహాలు ఉన్నా సమీపంలోని పోస్టల్ శాఖను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి