AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Ticket: టికెట్‌ తీసుకోకుండానే రైల్లో ప్రయాణిస్తున్నారా? టెన్షన్‌ లేదు.. ట్రైన్‌లో ఉండి కూడా తీసుకోవచ్చు.. ఎలాగంటే!

ప్రతిరోజు వేలాది మంది ప్రజలు రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై విపరీతమైన జనం ఉండటంతో ..

Train Ticket: టికెట్‌ తీసుకోకుండానే రైల్లో ప్రయాణిస్తున్నారా? టెన్షన్‌ లేదు.. ట్రైన్‌లో ఉండి కూడా తీసుకోవచ్చు.. ఎలాగంటే!
Train
Subhash Goud
|

Updated on: Nov 13, 2022 | 11:11 AM

Share

ప్రతిరోజు వేలాది మంది ప్రజలు రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అదే సమయంలో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై విపరీతమైన జనం ఉండటంతో టికెట్లు దొరక్క, రైలు మిస్సవుతుందన్న భయంతో టికెట్ లేకుండానే రైలు ఎక్కుతున్నారు. అయితే, మీరు టికెట్ లేకుండా రైలులో ప్రయాణిస్తే మీకు జరిమానా కూడా విధించవచ్చు. మీకు రైలు ఎక్కిన తర్వాత కూడా అన్‌రిజర్వ్‌డ్ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే మార్గాన్ని తెలుసుకోవడం మంచిది.

UTS యాప్

ఆన్‌లైన్ అన్‌రిజర్వ్డ్ రైలు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని రైల్వే యూటీఎస్‌ యాప్‌లో అందించింది. యూటీఎస్‌ అప్లికేషన్ ద్వారా రైలులో ప్రయాణించే ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత కూడా ఆన్‌లైన్‌లో అన్‌రిజర్వడ్‌ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి

మొబైల్ యాప్ UTS Android, iOS, Windows వెర్షన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేస్తుంది. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే సమయంలో టిక్కెట్ చెల్లింపు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయవచ్చు. రైల్వే అందించిన ఈ సదుపాయంతో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లతో పాటు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యూటీఎస్‌ నుండి అన్‌రిజర్వడ్‌ టికెట్ బుకింగ్ చేయడం ఎలా?

☛ ముందుగా UTS యాప్‌కి వెళ్లండి.

☛ సాధారణ బుకింగ్ ఎంపికను ఎంచుకోండి.

☛ ఆపై బయలుదేరే స్టేషన్ పేరు/కోడ్, గమ్యస్థాన స్టేషన్ పేరు/కోడ్‌ను నమోదు చేయండి.

☛ ప్యాసింజర్, మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ వంటి టిక్కెట్ రకాన్ని ఎంచుకోండి.

☛ పేపర్‌, పేపర్‌లెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

☛ వాలెట్‌ లేదా ఇతర ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతుల నుండి చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి.

☛ మీ టిక్కెట్ బుకింగ్ గురించి మీకు సందేశం వస్తుంది.

☛  యూటీఎస్‌ డాష్‌బోర్డ్‌లో టికెట్‌ చూచడవచ్చు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?