Online Interview Tips: ఆన్‌లైన్‌ ఇంటర్వూకి అటెండ్‌ అవుతున్నారా.? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..

Online Interview Tips: సోషల్‌ డిస్టెన్స్‌ కారణంగా ఆఫీసులు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ వర్క్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. ఇక సంస్థలు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ను ప్రోత్సహించడం ఎక్కువైంది. ఈ క్రమంలో...

Online Interview Tips: ఆన్‌లైన్‌ ఇంటర్వూకి అటెండ్‌ అవుతున్నారా.? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 11, 2021 | 6:54 PM

Online Interview Tips: కరోనా మహమ్మారి పుణ్యామాని మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. తీసుకునే ఆహారం నుంచి వేషాధారణ వరకు ప్రతి ఒక్క దానిపై వైరస్‌ ప్రభావం స్పష్టంగా పడింది. సోషల్‌ డిస్టెన్స్‌ కారణంగా ఆఫీసులు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ వర్క్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయింది. ఇక సంస్థలు సైతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ను ప్రోత్సహించడం ఎక్కువైంది. ఈ క్రమంలో నియమకాలు కూడా ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూకి హాజరుకావడానికి కొన్ని రకాల పద్ధతులను పాటిస్తుంటాం. మరి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ అంటేనే పూర్తిగా ఇంటర్‌నెట్‌తో మూడిపడి ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ ఉన్న సమయంలో సరైన నెట్‌ ఉండే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యమైన సందర్భం కాబట్టి వీలైనంత వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ కాకుండా.. స్పీడ్‌ ఎక్కువగా ఉండే బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను వినియోగించుకుంటే మంచిది.

* ఇంటర్వ్యూకి హాజరు అయ్యే సమయంలో మీ చుట్టు పక్కాల వెళుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. రిక్రూటర్స్‌ మీ బాడీ లాంగ్వేజ్‌ ఆధారంగా కూడా అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మీరు స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.

* ఇక కేవలం కనబడడమే కాకుండా వినబడడం కూడా అంతే ముఖ్యం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న హెడ్‌ సెట్లను ఉపయోగించాలి. మీరు చెప్పేది ఏదైనా అవతలి వ్యక్తికి స్పష్టంగా వినిపించేలా చూసుకోవాలి. అదే క్రమంలో వారు చెప్పేది కూడా మీకు వినబడాలి.

* ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లోనే కదా.. డ్రస్‌ ఏది వేసుకున్నా పర్లేదు కదా అని టీషర్ట్‌లు లాంటి వేసుకోకూడదు. రిక్రూటర్స్‌ మీ డ్రస్‌ సెన్స్‌ను గమనిస్తారనే విషయాన్ని మర్చిపోకూడదు.

* ఇక మీరు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో గదిలో ఎలాంటి శబ్ధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉండేది ఇంట్లో కాబట్టి.. టీవీ సౌండ్‌, చిన్న పిల్లల అల్లర్లు లేకుండా జాగ్రత్త పడాలి.

* ఇక ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌ అయినా.. ఆఫ్‌లైన్‌ అయినా.. మీరు సన్నద్ధమవడం మాత్రం ఒకేలా ఉంటుంది. కాబట్టి.. సంబంధిత సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలి. వీలైనంత వరకు అవును, కాదు.. అన్నట్లు కాకుండా వివారణాత్మకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి.

Also Read: మీ దగ్గర రూపాయి నోటు ఉందా..! అయితే సులువుగా 45 వేలు గెలుచుకోండి.. ఎలాగో తెలియాలంటే ఇది చదవండి..

Insomnia: నిద్రలేమితో బాధపడుతున్నారా..? డిప్రెషన్ బారిన పడకుండా ఈ పద్ధతులు పాటించండి..

Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులకు ముఖ్య గమనిక.. గురువారం రాత్రి ఈ దారుల్లో వెళ్లేవారు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!