AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSc Nursing Admissions 2025: బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్‌.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్‌ (నాలుగేళ్ల) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తులు..

BSc Nursing Admissions 2025: బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్‌.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
BSc Nursing Admissions
Srilakshmi C
|

Updated on: May 28, 2025 | 12:35 PM

Share

హైదరాబాద్, మే 28: రాష్ట్రంలోని పలు నర్సింగ్‌ కళాశాలల్లో.. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ నర్సింగ్‌ (నాలుగేళ్ల) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 28 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూన్‌ 20, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే 90007 80707, 80082 50842 పోన్‌ నంబర్లను కూడా సంప్రదించవచ్చు.

ప్రశాంతంగా ముగిసిన AP EAPCET 2025 పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజులుగా నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2025 పరీక్షలు మే 27తో ప్రశాంతంగా ముగిసిశాయి. ఈ మేరకు సెట్‌ ఛైర్మన్, వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఓ ప్రటకనలో తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి అన్ని సెషన్లు కలిపి 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 2,64,840 మంది అంటే 94.38 శాతం మంది హాజరైనట్లు సెట్‌ కన్వీనర్‌ వీవీ సుబ్బారావు తెలిపారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి అన్ని సెషన్లు కలిపి 81,837 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో 75,460 మంది అంటే 92.21 శాతం మంది హాజరయ్యారు. ఇక ఫలితాలు జూన్ 14వ తేదీన విడుదలకానున్నాయి.

తెలుగు విశ్వవిద్యాలయం MA ప్రవేశాలకు 2025 నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (గతంలో తెలుగు యూనివర్సిటీ).. వరంగల్‌ ప్రాంగణంలోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో 2025-26 విద్యాసంవత్సరానికిగానూ ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిపికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు పీఠాధిపతి గడ్డం వెంకన్న ఓప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జూన్‌ 24లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో జూన్‌ 30 వరకు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లు www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్‌సైట్‌లలో సందర్శించవచ్చు. అలాగే వర్కింగ్‌ డేస్‌లలో 99894 17299, 99891 39136 నంబర్లను కూడా సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.