AP DME Recruitment 2023 : ఏపీలో 480 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే సర్కార్ కొలువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనణ్.. ఏపీ డీఎంఈ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు.. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందులలో మొత్తం 21 స్పెషాలిటీల్లో మొత్తం 480 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నియామక ప్రకటన వెలువరించింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనణ్.. ఏపీ డీఎంఈ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు.. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందులలో మొత్తం 21 స్పెషాలిటీల్లో మొత్తం 480 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నియామక ప్రకటన వెలువరించింది. మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏయే స్పెషలైజేషన్లో ఖాళీలున్నాయంటే..
అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ,డీవీఎల్, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఓటోరినోలారింగాలజీ, ఆప్తల్మాలజీ, ఓబీజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, రెస్పిరేటరీ మెడిసిన్, అనెస్తీషియాలజీ, రేడియోడయాగ్నోసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్..స్పెషలైజేషన్‌లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు దారుల వయోపరిమితి 44 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ / ఈడబ్ల్యూఎస్ / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు రూ.250 చెల్లించవల్సి ఉంటుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, ఇంటర్వ్యూ రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నమాట. వాక్-ఇన్ ఇంటర్వ్యూ కింది అడ్రస్‌లో నవంబర్ 23, 2023వ తేదీన ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.70,000 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ అడ్రస్..
డీఎంఈ కార్యాలయం, పాత జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్‌పేట, విజయవాడ.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.