OU Civil Services Free Coaching 2024: ఉస్మానియాలో ఉచిత సివిల్ సర్వీస్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం.. ఎంపికైతే 4 నెలలపాటు ఫ్రీగా

యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సివిల్ సర్వీస్ అకాడమీ అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కింద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్‌)కు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 2, 2032వ తేదీలోగా..

OU Civil Services Free Coaching 2024: ఉస్మానియాలో ఉచిత సివిల్ సర్వీస్ కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం.. ఎంపికైతే 4 నెలలపాటు ఫ్రీగా
OU Civils Free Coaching
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 19, 2023 | 8:52 PM

హైదరాబాద్, నవంబర్‌ 19: యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన సివిల్ సర్వీస్ అకాడమీ అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కింద యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్‌)కు సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 2, 2032వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఉస్మానియా యూనివర్సిటీ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

ఉచిత యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్‌) కోచింగ్‌కు ఓయూ పీహెచ్‌డీ విద్యార్థులు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీలు, నిజాం కాలేజీల్లో చదువుతున్న పీజీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూనివర్సిటీలోని సివిల్ సర్వీస్ అకాడమీలో మొత్తం 100 వరకు సీట్లు ఉంటాయి. ఎంపికైన వారికి నాలుగున్నర నెలలపాటు ఇచిత శిక్షణ ఇస్తారు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ తదితర ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ 2, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు లేదంటే 8331041332 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

ఏపీలో ప్రైవేటు పాఠశాలల అనుమతులు 8 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, అదనపు సెక్షన్లకు ఆఫ్‌లైన్‌లో ప్రతిపాదనలు సమర్పించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ గుర్తింపు మూడేళ్లకోసారి ఇస్తూవచ్చింది. ప్రస్తుతం ఆ గడువును ఎనిమిదేళ్లకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే మూడేళ్లకు అనుమతులు పొందిన వాటిని ఎనిమిదేళ్లకు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆన్‌లైన్‌ ప్రకటనకు ముందు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించిన తనిఖీ ఫీజులను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెల్పింది. 2024-25 విద్యా సంవత్సరానికి కొత్త పాఠశాలల ఏర్పాటు, ఉన్నతీకరణకు ఎలాంటి జరిమానా లేకుండా డిసెంబరు 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024-25లో పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు అదనపు సెక్షన్లకు అనుమతి కోరుతూ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.