CTET Admit Card 2024: సీటెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. జులై 7న పరీక్ష నిర్వహణ
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 అడ్మిట్ కార్డులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. సీటెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ తమ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే జూన్ 24న సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల చేసిన సీబీఎస్సీ బోర్డు.. తాజాగా అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు తమ..
న్యూఢిల్లీ, జులై 5: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై 2024 అడ్మిట్ కార్డులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. సీటెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ తమ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే జూన్ 24న సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల చేసిన సీబీఎస్సీ బోర్డు.. తాజాగా అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి, అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సీటెట్ పరీక్ష దేశ వ్యాప్తంగా జులై 7వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్ష తేదీకి రెండు రోజులు ముందుగా అడ్మిట్ కార్డులను విడుదల చేసిన బోర్డు.. ఈ మేరకు డౌన్‌లోడ్ లింకును అందుబాటులోకి తీసుకొచ్చింది.
సీటెట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో ఓఎమ్మార్ విధానంలో జులై 7న పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్ధులు తమ పేరు, అడ్రస్, అలాటెడ్ సెంటర్, ఇతర సూచనలు తనిఖీ చేసుకోవాలని, తదనుగుణంగా పరీక్ష రోజున సూచనలు పాటించాలని సీబీఎస్సీ బోర్డు పేర్కొంది.
సీటెట్ 2024 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జాతీయ విద్యావిధానం అమలులో NCERT ఆపసోపాలు.. మరింత ఆలస్యంగా ఆరో తరగతి పాఠ్యపుస్తకాలు!
కొత్త సిలబస్ విధానం ప్రకారం స్కూలు పాఠ్యపుస్తకాల రూపకల్పనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులై 4న అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ నెల నుంచే బోధన ప్రారంభంకావల్సి ఉండగా.. ఇప్పటి వరకూ ఆరో తరగతి పాఠ్య పుస్తకాలు మార్కెట్లోకి రాని నేపథ్యలో ఆయన ఈ సమీక్ష నిర్వహించారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచే 3, 6 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు తీసుకొస్తామని NCERT ప్రగల్బాలు పలికినా మూడో తరగతి పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఆరో తరగతి పుస్తకాలు మాత్రం ఇంకా రెడీ కాలేదు. 6వ తరగతికి ఇంగ్లిషు, హిందీ పాఠ్యపుస్తకాలు ఈ వారం విడుదల చేయగా.. మిగతా పుస్తకాలు వచ్చేవరకు బ్రిడ్జి ప్రోగ్రాం బోధించాలని సూచనలు జారీ చేశారు. జాతీయ విద్యావిధానం ప్రకారం 1 నుంచి 12వ తరగతి వరకు కొత్త సిలబస్‌లో 2026 కల్లా సమగ్ర పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలని NCERT లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.