ICSE, ISC Result: 10, 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
ICSE, ISC Result: ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఐసీఎస్‌సీ 10వ తరగతి, ఐఎస్‌ఈ 12వ తరగతి..
ICSE, ISC Result: ఐసీఎస్ఈ, ఐఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఐసీఎస్‌సీ 10వ తరగతి, ఐఎస్‌ఈ 12వ తరగతి సెమిస్టర్ 1 పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ సెమిస్టర్ పరీక్షలను గతేడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 16 వరకు నిర్వహించారు. ఇక ఐఎస్‌సీ పరీక్షలను నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించారు.
పరీక్షలకు హాజరైన విద్యార్థు్లు ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్ సేవల ద్వారా కూడా విద్యార్థులు ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. కాగా పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రాల రివాల్యువేషన్ కోసం పేపర్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇందుకోసం ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు ఈ వెసులుబాటు కల్పించారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా గతేడాది ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని పరీక్షలను రద్దు చేసినట్లే ఈ పరీక్షలను కూడా రద్దు చేశారు. విద్యార్థుల ప్రతిభ ఆధాంగా ఫలితాలను ప్రకటించారు. అయితే ఈసారి కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో పరీక్షలు నిర్వహించి ఫలితాలను నిర్వహించారు.
Eyes Health: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ఆహారాలు తప్పనిసరి.. ఏంటో తెలుసుకోండి..?