Lata Mangeshkar: లతాజీ కలిపిచ్చిన ముద్ద తిన్న తర్వాతే మా ఆయన భోజనం చేసేవారు.. మధుర క్షణాలను గుర్తు చేసుకున్న అలనాటి నటి..
తన మధురమైన స్వరంతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించిన లతా మంగేష్కర్ (Lata Mangeshkar) (92) నిన్న ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
తన మధురమైన స్వరంతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించిన లతా మంగేష్కర్ (Lata Mangeshkar) నిన్న ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కరోనా (Covid) బారిన పడి కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం ఉదయం శాశ్వతంగా కన్నమూసినట్లు వైద్యులు ప్రకటించారు. లతాజీ అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో ముంబయి(Mumbai) లోని శివాజీ పార్క్‌లో నిర్వహించారు. కాగా లతా మంగేష్కర్ మృతిని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెతో గడిపిన మధురమైన క్షణాలను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈక్రమంలో బాలీవుడ్ అలనాటి నటి సైరాబాను లతాజీతో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.
కుటుంబ సభ్యురాలిని కోల్పోయాం!
‘దిలీప్ సాహెబ్ (సైరాబాను భర్త) కన్నుమూసినప్పుడు లతాజీ నాకు ఫోన్ చేసింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగోలేదు. అయినా నాకు ఫోన్ చేసి పరామర్శించారు. నాలో మనో ధైర్యాన్ని నింపింది. ఇప్పుడామే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. లతాజీ మృతితో మేం మరొక కుటుంబ సభ్యురాలిని కోల్పో్యాం. దిలీప్ సాహిబ్ లతాజీని సొంత సోదరిలా భావించేవారు. లండన్ ఆల్బర్ట్ హాల్‌లో వేదికగా జరిగన ఓ కార్యక్రమంలో లతాజీని వేదికపైకి పిలిచి ‘నా చోటి బహెన్ ( సోదరి)’ అని అందరికీ ఆమెను పరిచయం చేశారు. మేం తరచుగా కలిసేవాళ్లం. ఒక్కోసారి లతా మా ఇంటికి వచ్చేది. మరొకసారి మేమే ఆమె ఇంటికి వెళ్లేవాళ్లం. లతాజీ మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమెకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టేవాళ్లం. ఆసమయంలో లతాజీ తన చేతులతో కలిపి అందించిన ముద్దనే మొదటిగా తినేవారు దిలీప్ సాహెబ్.’ అంటూ లెజెండరీ సింగర్ తో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు సైరాబాను.
Also Read:Utterpradesh: అటవీ అధికారులు ఘనంగా గున్న ఏనుగుకి మొదటి పుట్టిన రోజు వేడుకలు.. నామకరణ..
Sleep From Home Job: 8 వారాల పాటు నిద్రపోతే 1.5 లక్షల జీతం.. ఎవరికి అవకాశం లభిస్తుందంటే..?
Hair care: జుట్టు డ్యామేజ్ కాకుండా సహజ పద్ధతుల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకోండిలా..