Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే భవదీయుడు నుంచి అప్డేట్..
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భవదీయుడు.. భగత్ సింగ్(Bhavadeeyudu Bhagat Singh).
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan), క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భవదీయుడు.. భగత్ సింగ్(Bhavadeeyudu Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరి కాంబోలో చిత్రం రానుండడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. కాగా ఈ సినిమాను ప్రకటించి చాలారోజులవుతోంది. ఇటీవల ఎలాంటి అప్డేట్‌లు కూడా రాలేదు. దీంతో భవదీయుడు అప్డేట్ కావాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డైరెక్టర్ హరీశ్‌ను అడుగుతున్నారు. దీనిపై స్పందించిన హరీశ్ పాడ్‌కాస్ట్ ద్వారా అభిమానులకు సమాధానమిచ్చారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేస్తానని అందులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని డైలాగ్‌ను మరోసారి గుర్తు చేశారు హరీశ్. ‘ సినిమాలో టైమింగ్ ఎంత ముఖ్యమో.. సినిమాకు టైమింగ్ అంతే ముఖ్యమని నేను నమ్ముతాను. అతి త్వరలోనే పవర్‌స్టార్ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మీ సపోర్ట్, ఓపికకు ధన్యవాదాలు’ అని హరీశ్ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే పవన్ కోసం రెండు అదిరిపోయే పాటలు కంపోజ్ చేసినట్లు సమాచారం. కాగా పవన్, రానా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్‌స్టార్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కూడా పునఃప్రారంభం కానుంది.
— Harish Shankar .S (@harish2you) February 6, 2022
Also Read:Hair care: జుట్టు డ్యామేజ్ కాకుండా సహజ పద్ధతుల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకోండిలా..
Google Chrome: ఎనిమిదేళ్ల తర్వాత లోగోను మార్చేసిన గూగుల్.. ఫన్నీ కామెంట్స్ చేస్తోన్న నెటిజన్లు..