AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair care: జుట్టు డ్యామేజ్‌ కాకుండా సహజ పద్ధతుల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్‌ చేసుకోండిలా..

చాలా మంది మహిళలు స్ట్రెయిట్ హెయిర్‌ (Hair straightening) ను ఇష్టపడతారు. ఇందుకోసం స్ట్రెయిటెనింగ్ టూల్స్, కెరాటిన్ స్మూటింగ్ వంటి రసాయనాలతో కూడిన పద్ధతులను అవలంభిస్తారు.

Hair care: జుట్టు డ్యామేజ్‌ కాకుండా సహజ పద్ధతుల్లో హెయిర్ స్ట్రెయిటెనింగ్‌ చేసుకోండిలా..
Hair Care
Basha Shek
|

Updated on: Feb 07, 2022 | 7:12 AM

Share

చాలా మంది మహిళలు స్ట్రెయిట్ హెయిర్‌ (Hair straightening) ను ఇష్టపడతారు. ఇందుకోసం స్ట్రెయిటెనింగ్ టూల్స్, కెరాటిన్ స్మూటింగ్ వంటి రసాయనాలతో కూడిన పద్ధతులను అవలంభిస్తారు. అయితే అవి దీర్ఘకాలంలో మన జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. జుట్టును బలహీనంగా మారుస్తాయి. రసాయనాలతో కూడిన హెయిర్‌ ప్యాక్‌లు (hair packs), మాస్క్‌లు (hair masks) జుట్టు కుదుళ్లను దెబ్బతీసి హెయిర్‌ ఫాల్‌కు దారి తీస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు సహజమైన వంటగది పదార్థాలను ఉపయోగించి హెయిర్ మాస్క్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అవి మీ జుట్టును సహజస్థితిలో స్ట్రెయిటెనింగ్‌ చేస్తాయి. అదేవిధంగా శిరోజాలకు అవసరమైన పోషణను కూడా అందిస్తాయి. అరటిపండు, తేనె, కొబ్బరి పాలు, అలోవెరా జెల్ మొదలైన వాటిని ఉపయోగించి మీరు ఈ హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు.

అరటి, తేనె హెయిర్ మాస్క్..

ఈ మాస్క్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 అరటిపండ్లు, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు అవసరం. అరటిపండు ముక్కలను ఒక గిన్నెలో వేసి ఫోర్క్ సహాయంతో మెత్తగా చేయాలి. తేనె, ఆలివ్ నూనె, పెరుగు ఈ మిశ్రమానికి జోడించండి. అన్ని పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు మాస్క్‌లాగా అప్లై చేసుకుని సుమారు 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి మూడుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితముంటుంది.

కొబ్బరి పాలు, జెలటిన్..

దీని కోసం 1 కప్పు కొబ్బరి పాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల కార్న్ స్టార్చ్, 2 టేబుల్ స్పూన్ల జెలటిన్ పౌడర్ అవసరం. ఒక గిన్నెలో కొబ్బరి పాలు, నూనె, తేనె వేసి బాగా కలపాలి. దీనికి నిమ్మరసం జోడించాలి. ఆపై మొక్కజొన్న పిండి జిలాటిన్ పౌడర్‌ ను జతచేయండి. ఈ హెయిర్ మాస్క్‌ని జుట్టుకు 30 నిమిషాల పాటు పట్టించాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

పాలు, తేనె..

తేనె, పాలు.. ఈ రెండూ జుట్టుకు తేమను అందిస్తాయి. ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, మీకు 1/4 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల తేనె అవసరం. ఒక గిన్నెలో పాలు, తేనె పోసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి సుమారు 1-2 గంటల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితముంటుంది.

అలోవెరా జెల్, కొబ్బరి పాలు..

ఈ హెయిర్ మాస్క్ చేయడానికి, మీకు 3-5 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, 1 టేబుల్ స్పూన్ తేనె అవసరం. ఒక గిన్నెలో అలోవెరా జెల్, కొబ్బరి పాలు, తేనె తీసుకోండి. అన్ని పదార్థాలను బాగా కలపండి. ఈ హెయిర్ మాస్క్‌ని రాత్రి పడుకునే ముందు శిరోజాలకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Also Read:Medaram: తెలంగాణ కుంభమేళాకు సర్కార్ భారీ ఏర్పాట్లు.. మేడారం మహా జాతరకు అధికారిక సెలవులు దక్కేనా?

Google Chrome: ఎనిమిదేళ్ల తర్వాత లోగోను మార్చేసిన గూగుల్.. ఫన్నీ కామెంట్స్ చేస్తోన్న నెటిజన్లు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఏ పని చేపట్టినా సక్సెస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..