AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir- Alia: బాలీవుడ్‌ ప్రేమ పక్షుల పెళ్లిపై మళ్లీ మొదలైన పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన అలియా సన్నిహితులు..

ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకుంటూ గతేడాది కత్రినా కైఫ్‌ (Katrina Kaif) - విక్కీ కౌశల్‌(Vicky Kaushal) , రాజ్‌కుమార్ రావ్‌- పత్రలేఖ, అంఖితా లోఖండే- విక్కీ పెళ్లిపీటలెక్కారు

Ranbir- Alia: బాలీవుడ్‌ ప్రేమ పక్షుల పెళ్లిపై మళ్లీ మొదలైన పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన అలియా సన్నిహితులు..
Ranbir Alia
Basha Shek
|

Updated on: Feb 07, 2022 | 8:16 AM

Share

ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకుంటూ గతేడాది కత్రినా కైఫ్‌ (Katrina Kaif) – విక్కీ కౌశల్‌(Vicky Kaushal) , రాజ్‌కుమార్ రావ్‌- పత్రలేఖ, అంఖితా లోఖండే- విక్కీ పెళ్లిపీటలెక్కారు. తాజాగా నాగిన్‌ బ్యూటీ మౌనీరాయ్‌ కూడా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. దీంతో బాలీవుడ్‌లో తదుపరి పెళ్లి చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), అందాల తార అలియా భట్‌ (Aliabhatt) లదేనని చాలామంది అనుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ప్రేమపక్షుల వివాహంపై బాగా ప్రచారం సాగుతోంది. సమ్మర్‌లో మార్చిలేదా ఏప్రిల్‌లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ తరచూ వెకేషన్లకు వెళ్లే రాజస్థాన్‌లోని ప్రముఖ పర్యాటక క్షేత్రం రణతంబోర్‌లో వీరి పెళ్లికి ఏర్పాట్లు సాగుతున్నాయని కొందరు, కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌ ఒక్కటైన సిక్స్ సెన్సెస్ రిసార్ట్ ఫోర్ట్ బార్వారాలోనే రణ్‌బీర్‌- అలియాల పెళ్లి జరుగుతుందని మరికొందరు అనుకుంటున్నారు.

అయితే అలియా పెళ్లిపై వస్తోన్న వార్తలు, ప్రచారాన్ని ఆమె సన్నిహితులు ఖండిస్తున్నారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ‘రణబీర్-ఆలియాల వివాహం గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు ఏప్రిల్‌లో ఏడడుగులు నడవునున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ప్రస్తుతం వారిద్దరు తమ సినిమా కెరీర్లపై పూర్తి దృష్టి సారించారు. అలియా ‘గంగుబాయి కతియా వాడీ’ ప్రమోషన్లలో ఉండగా.. రణ్‌బీర్‌ తన అప్‌కమింగ్‌ ప్రాజెక్టు షూటింగుల్లో బిజీగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చారు. దీంతో రణ్‌బీర్‌- అలియాల పెళ్లి రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది. కాగా అలియా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. Also Read:Nellore District: వందలాది పావురాళ్లను ఎగరేసేందుకు రంగం సిద్ధం.. అంతలోనే ఆటకట్టు

Pawan Kalyan: పవర్‌ స్టార్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. త్వరలోనే భవదీయుడు నుంచి అప్డేట్‌..

West Bengal Politics: సెంటర్ వర్సెస్ బెంగాల్‌ పోరులో మరో ఎపిసోడ్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు?

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..