West Bengal Politics: సెంటర్ వర్సెస్ బెంగాల్‌ పోరులో మరో ఎపిసోడ్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు?

పశ్చిమ బెంగాల్ కొత్త వివాదం రాజుకుంది. సెంటర్ వర్సెస్ బెంగాల్ పోరులో మరో ఎపిసోడ్ తెరపైకి వచ్చింది.

West Bengal Politics: సెంటర్ వర్సెస్ బెంగాల్‌ పోరులో మరో ఎపిసోడ్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఎవరు?
Jyotiraditya Scindia On Mamata Banerjee
Follow us

|

Updated on: Feb 07, 2022 | 7:32 AM

West Bengal Political Heat: పశ్చిమ బెంగాల్ కొత్త వివాదం రాజుకుంది. సెంటర్(Union Government) వర్సెస్ బెంగాల్ పోరులో మరో ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ(Mamata Banerjee), గ‌వ‌ర్నర్ ధ‌న్కర్ మ‌ధ్య వార్‌ న‌డుస్తున్న క్రమంలోనే కొత్త వ్యవ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. సీఎం మ‌మ‌తా వ‌ర్సెస్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) తాజా గొడ‌వ‌ వివాదం. మ‌మ‌త ప్రభుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేంద్ర పౌర విమాన‌యాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. దీంతో బెంగాల్ రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడేక్కాయి. భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

బెంగాల్‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్పనకు తాము ప్రయత్నిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం స‌హ‌క‌రించ‌డం లేద‌ంటున్నారు సింధియా. బెంగాల్‌లో రెండో విమానాశ్రయం క‌ట్టాల‌ని కేంద్రం భావించింది, భూమి ఇవ్వడానికి మ‌మ‌త స‌ర్కార్ ఏమాత్రం ముందుకు రావ‌డం లేద‌ని సింధియా అస‌హ‌నం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న నేతాజీ ఎయిర్‌పోర్ట్ కెపాసిటీ పూర్తైంది. పూర్తి సామ‌ర్థ్యంతో న‌డుస్తున్నా… ఇంకో ఎయిర్‌పోర్ట్ అవ‌స‌రం ఉంది. ఈ విష‌య‌ంపై చర్చించడానికి తాను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని క‌ల‌వడానికి 6 నెల‌లుగా ప్రయత్నిస్తున్నానని అన్నారు సింధియా. అయినా సీఎం మ‌మ‌త స‌మ‌యం ఇవ్వడం లేదంటూ కేంద్ర మంత్రి ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మించ‌డానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే ఎలా నిర్మించగలమని సింధియా ప్రశ్నించారు.

ఇప్పటికే సెంటర్ వర్సెస్ బెంగాల్, సీఎం వర్సెస్ గవర్నర్ కోల్డ్ వార్ నడుస్తున్న క్రమంలో తాజా పంచాయితీ తెరపైకి వచ్చింది. అయితే కేంద్ర మంత్రి చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి నిధుల కోసం కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేస్తుంటాయి. అయితే ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామంటే.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర మంత్రి బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Read Also….  UP Elections 2022: 45 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. బల్లియా నుండి స్వాతి సింగ్ భర్త దయాశంకర్