Digital rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి.. డిజిటల్, క్రిప్టో కరెన్సీకి మధ్య తేడా ఏంటి..

ఇండియాలో డిజిటల్ కరెన్సీ(Digital currency) తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) బడ్జెట్(Budget 2022) ప్రసంగంలో చెప్పారు...

Digital rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి.. డిజిటల్, క్రిప్టో కరెన్సీకి మధ్య తేడా ఏంటి..
Digital Currency
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 07, 2022 | 7:18 AM

ఇండియాలో డిజిటల్ కరెన్సీ(Digital currency) తీసుకొస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) బడ్జెట్(Budget 2022) ప్రసంగంలో చెప్పారు. అధికారిక డిజిటల్ కరెన్సీ 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ-వాలెట్లను పోలి ఉండే విధంగా డిజిటల్ కరెన్సీని రూపొందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతి భౌతిక కరెన్సీ నోటుకు ప్రత్యేక నెంబర్ ఉన్నట్టుగానే.. డిజిటల్ కరెన్సీకి యూనిట్ల రూపంలో నెంబర్లు కేటాయించనుందని పేర్కొన్నాయి. భౌతిక కరెన్సీకి ఎలక్ట్రానిక్ రూపమే డిజిటల్ కరెన్సీ. కంప్యూటర్లు, ఫోన్లు, డిజిటల్ పరికరాల్లో నిక్షిప్తం చేసుకొని, ఉపయోగించే కరెన్సీనే డిజిటల్ కరెన్సీగా చెబుతున్నారు.

భౌతిక నోట్లను ముద్రించే కేంద్ర రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) డిజిటల్ కరెన్సీని తయారు చేస్తుంది. ఇది భౌతిక కరెన్సీతో సమానం అన్న మాట. ఇప్పుడు చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లను డిజిటల్ రూపంలో జారీ చేయనున్నారు. డిజిటల్ కరెన్సీ ఫోన్‌లోనే నిల్వ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపులన్నీ దీని ద్వారా చేసుకోవచ్చు. ప్రైవేటు కంపెనీ మొబైల్ వాలెట్లలో అందుబాటులో ఉన్నటువంటి.. అన్ని రకాల లావాదేవీలను ప్రభుత్వం జారీ చేసే డిజిటల్ కరెన్సీ ద్వారా నిర్వహించుకునే అవకాశం ఉంది.

ఇప్పుడు ప్రైవేటు కంపెనీల వాలెట్లు సైతం డిజిటల్ కరెన్సీ లాంటివే. మన బ్యాంకు ఖాతాలోని నగదును ప్రైవేటు వాలెట్లలోకి మళ్లించి.. చెల్లింపులు చేస్తాం. విశ్వసనీయతలో ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి, ప్రైవేటు సంస్థల సేవలకు తేడా ఉంది. ప్రైవేటు కంపెనీ ‘ఈ-వాలెట్​’కు నగదు ట్రాన్స్​ఫర్ చేస్తే.. ఆ సంస్థ విధించే ఛార్జీలను మనం భరించాలి. ప్రైవేటు కంపెనీలు అందించే వాలెట్ సర్వీసులో.. ముందుగా మనం చేసే పేమెంట్‌లు సంస్థకు వెళ్తాయి. ఆ లావాదేవీని మన తరఫున సంస్థ పూర్తి చేస్తుంది. మన తరఫున డబ్బును నిల్వ చేసి.. చెల్లింపులు చేస్తాయి.

డిజిటల్ కరెన్సీ వల్ల నగదు నిర్వహణా భారం తగ్గుతుంది. డిజిటల్ కరెన్సీకి అయ్యే ఖర్చు.. భౌతిక కరెన్సీని ముద్రించడానికి అయ్యే వ్యయంతో పోలిస్తే తక్కువ. ఈ కరెన్సీ వల్ల దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సైతం ఊతం లభిస్తుందని కేంద్రం ఆశిస్తోంది.

డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ లాంటిదేనా?

రెండు వేరువేరు. రెండూ డిజిటల్ రూపంలోనే ఉన్నప్పటికీ.. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ వేరుగా ఉంటాయి. క్రిప్టో కరెన్సీలు, ప్రైవేటు వర్చువల్ కరెన్సీలతో మన డిజిటల్ కరెన్సీకి పోలిక ఉండదు. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ కానీ, క్రిప్టో కరెన్సీని గానీ జారీ చేసేవారు ఉండరు. కాబట్టి ఓ వ్యక్తికి చెందిన రుణంగా లేదా పూచీకత్తుగా వాటిని పరిగణించలేం. అందుకే ఆర్‌బీఐ ప్రైవేటు క్రిప్టో కరెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాటి వల్ల జాతీయ భద్రతో పాటు, ఆర్థిక అస్థిరతకు ముప్పు ఉంటుందని చెబుతోంది.

Read Also.. White Label ATM: వైట్ లేబుల్ ఏటీఎం అంటే ఏంటో తెలుసా.. వాటి ద్వారా డ్రా చేసుకోవచ్చా..

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!