Investments: చిన్న వయస్సులో ఉద్యోగం వచ్చిందా.. అయితే ఈ పని చేయండి..
మీ జీతం తక్కువ కావొచ్చు కానీ ఆర్థిక క్రమశిక్షణ ఉంటే కోటిశ్వరులు కావొచ్చు.. ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే మీ జీతం ఎక్కవైనా డబ్బులు సంపాదించలేరు...
మీ జీతం తక్కువ కావొచ్చు కానీ ఆర్థిక క్రమశిక్షణ ఉంటే కోటిశ్వరులు కావొచ్చు.. ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే మీ జీతం ఎక్కవైనా డబ్బులు సంపాదించలేరు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ(financial discipline) ముఖ్యం. ముఖ్యంగా ఎంత త్వరగా పెట్టుబడులు(Investments) ప్రారంభిస్తే అంత త్వరగా మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరకోవచ్చు. కానీ చాలా మంది వివాహం(marriage) అయ్యి, పిల్లలు పుట్టాక పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారు. కానీ, అప్పటికే ఆలస్యం అవుతుంది. ఎందుకంటే లక్ష్యానికి నిర్ణీత సమయం మాత్రమే ఉంటుంది. దీంతో రిస్క్ ఎక్కువగా ఉండే పెట్టుబడుల జోలికి వెళ్లరు.
అలా కాకుండా యుక్త వయసులో ఉన్నప్పుడు పెట్టుబడులు ప్రారంభిస్తే మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి దగ్గర కావాల్సినంత సమయం ఉంటుంది. ముఖ్యంగా చిన్నవయస్సులోనే ఉద్యోగం వచ్చిన వారు పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగంలో చేరిన కొత్తలోనే డబ్బు పెట్టుబడి పెట్టేందుకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ పొదుపు చేసుకోవడం మంచిది.
20 ఏళ్ల వయస్సులో పెట్టుబడుల ప్రపంచంలోకి అడుగుపెట్టడం జీవితంలో గొప్ప మలుపునకు శ్రీకారం అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో యువత జీవితం పట్ల ఉన్నతమైన ఆలోచనలతో ఉంటున్నారు. ప్రారంభంలోనే మంచి కొలువులను సాధిస్తున్నారు. మంచి వేతనంతోనే కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. ఉద్యోగం సాధించడంలోనే కాదు మదుపు విషయంలోనూ ప్రణాళికాయుతంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం సరైన పెట్టుబడి మార్గాల కోసం వెతుకుతున్నారు.
చిన్న వయసులో ఉన్నప్పుడు కాస్త నష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకే పెట్టుబడుల్లో 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించినా ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలంలో పెట్టుబడులు సంపదను సృష్టించేందుకు ఉపయోగపడతాయి. వీటిని ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత వేగంగా మనం వృద్ధి చెందవచ్చు. మ్యూచువల్ ఫండ్లు వైవిధ్యమైన పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. అదే సమయంలో ఇవి నిపుణుల పర్యవేక్షణలో పనిచేస్తాయి.
Read Also.. Digital rupee: డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి.. డిజిటల్, క్రిప్టో కరెన్సీకి మధ్య తేడా ఏంటి..