AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: చీరకట్టులో చామంతి.. పంజాబీ డ్రెస్‌లో పూబంతి.. ఎవరో గుర్తుపట్టారా..?

Telugu Actress : ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో.. సెలబ్రిటీలు.. వారి అభిమానులకు మధ్య మధ్య దూరం తగ్గిపోయింది. ప్రజంట్ డిజిటల్ యుగంలో ఇతమ అభిమాన స్టార్స్ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.

Viral Photo: చీరకట్టులో చామంతి.. పంజాబీ డ్రెస్‌లో పూబంతి.. ఎవరో గుర్తుపట్టారా..?
Heroine Childhood Pic
Ram Naramaneni
|

Updated on: Feb 07, 2022 | 9:32 AM

Share

Tollywood Heroine: ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెలబ్రిటీల జోరు ఏ రేంజ్‌లో ఉందో చూస్తున్నాం. వారు ఒక్క ఫోటో పెడితే చాలు.. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తారు. ఆ పిక్‌ లేదా వీడియోని ట్రెండింగ్‌లోకి తీసుకొస్తారు. ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ బయట ఉండేవి.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)కి చేరాయి. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో.. సెలబ్రిటీలు.. వారి ఫ్యాన్స్‌కు మధ్య మధ్య దూరం తగ్గిపోయింది.  ఇక స్టార్స్ సైతం తమ మూవీ అప్‌డేట్స్‌ను పంచుకోవడమే కాకుండా లైవ్ చాట్స్‌తో  ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అంతేకాదు తన లైఫ్‌లో జరిగే మేజర్ ఇన్సిడెంట్స్ గురించి వారితో పంచుకుంటున్నారు.  ఇదిలా ఉంటే ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter), ఇన్‌స్టా వేదికలుగా ‘త్రోబ్యాక్’ పిక్స్(Throwback Pics) ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. హీరో, హీరోయిన్లు స్పేస్ ఉన్నప్పుడల్లా తమ చైల్డ్‌హుడ్ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. బాల్యపు గుర్తులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ కోవలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ పిక్(Childhood Pic) సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. ఈ ఫోటోలో ఎంతో అమాయకంగా ఫోజిచ్చిన ఈ చిన్నది.. సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఎంత తీక్షణంగా చూసినా ఆమెవరో గుర్తించలేకపోయారా..? మేమే చెప్పేస్తాం. ఈ ఫోటోలో ఉంది.. నందిత శ్వేత. 2006లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత ఉదయ మ్యూజిక్‌ ఛానల్ లో వీజేగా తన కెరీర్ ను ప్రారంభించింది. 2008న కన్నడ చిత్రం ‘నంద లవ్స్ నందిత’ చిత్రంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు నందిత అని పేరు ఉండడంతో, ఆ పేరునే తన స్క్రీన్ పేరుగా పెట్టుకుంది. 2012లో పా రంజిత్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అట్టకతి’లో నటించింది. ఈ సినిమాలోని నటనకు ప్రశంసలు అందుకుంది.  నిఖిల్ నటించిన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఆ తర్వాత నందితకు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ లక్ కలిసిరాలేదు. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే చేసింది. ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’, ‘కల్కీ’, ‘అక్షర’ వంటి తెలుగు సినిమాలో నటించింది. చివరగా సుమంత సరసన ‘కపటదారి’ చిత్రంలో మెరిసింది. ప్రజంట్ తెలుగు సూపర్ హిట్ డ్యాన్స్ షో ‘ఢీ’ లో ఒక న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.

Also Read: Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి

గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్‌-19 వరల్డ్‌ కప్‌‌ విజయంలో కీ రోల్..