AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: మహమ్మారి నుంచి బిగ్‌ రిలీఫ్‌.. 32 రోజుల తర్వాత లక్ష దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..

మూడోవేవ్‌ అంటూ ముచ్చెమటలు పట్టించిన కరోనా (Corona) మహమ్మారి శాంతిస్తోంది. వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

Coronavirus: మహమ్మారి నుంచి బిగ్‌ రిలీఫ్‌.. 32 రోజుల తర్వాత లక్ష దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..
Basha Shek
|

Updated on: Feb 07, 2022 | 10:14 AM

Share

మూడోవేవ్‌ అంటూ ముచ్చెమటలు పట్టించిన కరోనా (Corona) మహమ్మారి శాంతిస్తోంది. వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మొన్నటివరకు మూడ లక్షలోపే నమోదైన కొత్త కేసులు (Daily cases) నిన్న లక్ష దిగువకు  పడిపోవడం గమనార్హం. 32 రోజుల (32 days) తర్వాత లక్ష లోపు కేసులు నమోదు కావడం గమనార్హం. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 83, 876 కేసులు నమోదు కాగా.. 895 మరణాలు సంభవించాయి. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఉదయం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 11,08,938 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 7.25 శాతానికి పడిపోయింది. కాగా నిన్న నమోదైన కరోనా 895 మరణాల్లో కేరళ నుంచే 378 మంది ఉన్నారు. అయితే ఇందులో ఎక్కువ మొత్తం సవరించిన మరణాలే ఉండడం గమనార్హం. గత కొన్ని రోజులగా కేరళ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ మృతుల వివరాలను సేకరిస్తూ మరణాల సంఖ్యను సవరిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా 5,02,874 మంది మృత్యువాత పడ్డారు.

170 కోట్లకు చేరువలో టీకా డోసుల పంపిణీ…

ఇక ఆదివారం 1,99,054 మంది కరోనా నుంచి కోలుకోవడం ఎంతో ఊరటనిచ్చే అంశం. తాజా రికవరీలతో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,06,60,202 మంది కొవిడ్‌ను జయించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 169.63 కోట్ల డోసుల టీకాలు అందజేయగా.. ఆదివారం 14,70,053 డోసుల టీకాలు పంపిణీ చేశారు. దీంతో కరోనా టీకాల పంపిణీ 170 కోట్లకు చేరువవుతోంది. కాగా భారత్ లో ఇప్పటివరకు 74.15 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 11,56,363 టెస్టులు నిర్వహించారు.

Also Read:

Virat Kohli: విరాట్ కోహ్లీ ఔటైన విధానం షాకింగ్‌గా ఉంది.. ప్రస్తుతం అతను సరిగాలేడు.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Lord Shiva: దేవుడైన మహాదేవుని పూజించే ముందు, ఈ ముఖ్యమైన నియమాలను తప్పక పాటించండి..

Lata Mangeshkar: లతాజీ కలిపిచ్చిన ముద్ద తిన్న తర్వాతే మా ఆయన భోజనం చేసేవారు.. లెజెండరీ సింగర్‌తో మధుర క్షణాలను గుర్తు చేసుకున్న అలనాటి నటి..