Lord Shiva: పరమశివుడిని పూజించే ముందు, ఈ ముఖ్యమైన నియమాలను తప్పక పాటించండి..

Lord Shiva: సృష్టి లయకారుడు పరమశివుడు చాలా దయగలవాడు. జలంతో అభిషేకించినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు(Bholashankara). శివుడిని పూజించే సాధకుడి జీవితానికి సంబంధించిన..

Lord Shiva: పరమశివుడిని పూజించే ముందు, ఈ ముఖ్యమైన నియమాలను తప్పక పాటించండి..
Lord Shiva Puja On Monday
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2022 | 10:51 AM

Lord Shiva: సృష్టి లయకారుడు పరమశివుడు చాలా దయగలవాడు. జలంతో అభిషేకించినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు(Bholashankara). శివుడిని పూజించే సాధకుడి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి. దేవతలకు దేవుడు.. మహాదేవుడిని కొందరు శివుడు, ఇంకొందరు శంకరుడు, భోలేనాథ్ , గంగాధరుడు, వంటి అనేక పేర్లతో పిలుస్టారు. ఆయన్ని పూజిస్తారు . శివునికి ఎ వ్యక్తి, ఎ ప్రాంతంతో సంబంధం ఉంటుందో.. అదే విధంగా ఆ రూపంలోనే ప్రసిద్ది చెందాడు. ఉదాహరణకు, శివుడు రావి చెట్టు క్రింద పూజలండుకుంటుంటే.. అతని భక్తులు అతనిని రవి చెట్టు దగ్గర శివుడు అని పిలవడం ప్రారంభిస్తారు. ఆ మహాదేవుడిని అనుగ్రహం కోసం శివుని పూజకు సంబంధించిన ఈ ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా తెలుసుకోండి.

* అన్నింటిలో మొదటి నియమం శివుడిని ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనస్సు, శరీరం తో పూజించాలి. అదే సమయంలో, ఎల్లప్పుడూ కుట్టని బట్టలు ధరించి శివుడిని పూజించడానికి ప్రయత్నించండి .

*నేలపై కూర్చొని శివుడిని ఎప్పుడూ పూజించకండి . శివుని ఆరాధనలో దర్భాసనాన్ని ఉపయోగించండి . వీలైతే ఆసనంలో కూర్చుని శివుడిని పూజించండి .

*శివుడిని ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరంముఖంగా పూజించాలి.

*శివపూజ సమయంలో మీ మనస్సులో ఎలాంటి కోపం , అసూయ, మరేదైనా తప్పుడు భావం రానీయకుండా చూసుకోవాలి.

*శివుడిని పూజించేటప్పుడు, భస్మం ,రుద్రాక్ష మొదలైన వాటిని శివునికి సమర్పించి, మీ నుదుటిపై భస్మాన్ని ధరించండి, రుద్రాక్షను ధరించండి .

*శంకరుని పూజలో నువ్వులు, సంపంగి పువ్వులు ఉపయోగించరాదు.

*వీలైతే, తెల్లటి పువ్వులు, గంజాయి , బిల్వ పత్రం , జమ్మి ఆకులు మొదలైన వాటిని శివుని పూజలో సమర్పించాలి .

*శివుని అనుగ్రహం పొందడానికి, ఎల్లప్పుడూ పాలు కలిపిన నీటితో శివలింగాన్ని అభిషేకించండి . శివలింగంపై పాల పెకేట్లతో అభిషేకం చేయవద్దు. ఎల్లప్పుడూ ఒక పాత్రలో పాలు పోసి శివలింగానికి అబిషేకం చేయండి. అంతేకాదు శివునికి సమర్పించే పాలు ఎప్పుడూ చల్లగా ఉండాలి . ఎప్పుడూ పాలు కాచి శివునికి సమర్పించవద్దు .

*శివలింగాన్ని ఎక్కడైనా పూజించిన అనంతరం దాని స్థానాన్ని పదే పదే మార్చకండి. ఒకవేళ ఎప్పుడైనా ఉన్న చోటు నుంచి మార్చవలసి వస్తే.. ముందు శివలింగాన్ని గంగాజలంతో చల్లని పాలతో స్నానం చేయించి తర్వత శివుడికి క్షమాపణలు చెప్పి.. అనంతరం స్థాన మార్పిడి చేయండి.

*ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాలని ఆలోచిస్తున్నట్లయితే, లింగాన్ని ఎప్పుడూ ఒంటరిగా పూజ గదిలో పెట్టవద్దు.. శివునితో పాటు, నందిని , గణేశుడు, పార్వతిని కూడా ప్రతిష్టించి పూజించండి .

Note: (ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

 భారీ రాబడిని ఇచ్చిన స్మాల్‌క్యాప్ స్టాక్స్‌.. ఆ ఐదు కంపెనీలు ఏమిటంటే..